283 మంది పోలీసు సిబ్బంది బదిలీ
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:45 AM
సాధారణ బదిలీల్లో భాగంగా 283 మంది పోలీసు సిబ్బందికి ఆన్‌లైన్ విధానంలో బదిలీలు జరిగాయి. ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకాల ప్రకారం బదిలీల ప్రక్రియనిర్వహించారు. ఒక పోలీసు స్టేషన్‌లో ఐదు సంవత్సరాలు, అంతకుపైబడి పనిచేస్తున్న సిబ్బందికి ఆప్షన్‌తో పనిలేకుండా స్థానచలనం కల్పించారు. ఆన్‌లైన్ విధానంలో సాగిన బదిలీల ప్రక్రియను ఏఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, ఏఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్‌రావు పర్యవేక్షించారు.
161 మంది పీసీలు, 95 మంది హెచ్‌సీలు, 27 మంది ఏఎస్‌ఐలు
ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి తప్పని స్థానచలనం
అనకాపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సాధారణ బదిలీల్లో భాగంగా 283 మంది పోలీసు సిబ్బందికి ఆన్‌లైన్ విధానంలో బదిలీలు జరిగాయి. ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకాల ప్రకారం బదిలీల ప్రక్రియనిర్వహించారు. ఒక పోలీసు స్టేషన్‌లో ఐదు సంవత్సరాలు, అంతకుపైబడి పనిచేస్తున్న సిబ్బందికి ఆప్షన్‌తో పనిలేకుండా స్థానచలనం కల్పించారు. ఆన్‌లైన్ విధానంలో సాగిన బదిలీల ప్రక్రియను ఏఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, ఏఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్‌రావు పర్యవేక్షించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో ఖాళీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి వివరిస్తూ, సీనియారిటీ ప్రకారం స్టేషన్‌లను కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆన్‌లైన్ విధానంలో మొత్తం 283 మందికి బదిలీలు జరిగాయి. వీరిలో 161 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 95 మంది హెచ్ కానిస్టేబుల్స్, 27 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. బదిలీ అయిన పీసీల్లో 57 మంది మహిళలు వున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:45 AM