ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

23 కిలోల లిక్విడ్‌ గంజాయి స్వాధీనం

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:23 PM

ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్న 23 కిలోల లిక్విడ్‌ గంజాయి(హ్యాష్‌ ఆయిల్‌)ను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ టీవీవీఎస్‌ఎన్‌.ఆచారి తెలిపారు.

స్వాధీనం చేసుకున్న లిక్విడ్‌ గంజాయి, నిందితులతో ఎక్సైజ్‌ అధికారులు

ముగ్గురి అరెస్టు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్న 23 కిలోల లిక్విడ్‌ గంజాయి(హ్యాష్‌ ఆయిల్‌)ను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ టీవీవీఎస్‌ఎన్‌.ఆచారి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పాడేరు - జి.మాడుగుల ప్రధాన రహదారిలోని ఇరడాపల్లి పంచాయతీ బొక్కెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహించామన్నారు. అటుగా వస్తున్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 23 కిలోల లిక్విడ్‌ గంజాయి లభ్యమైందన్నారు. నిందితులను చిత్రకొండ మండలానికి చెందిన ఖారా దాసు, మర్థిపల్లి గ్రామానికి చెందిన పాంగి చిన్నారావు, గడిగుంట గ్రామానికి చెందిన వంతాల మహేశ్‌గా గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.హనుమంత నాయక్‌, టి.కేశవ, హిరణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:23 PM