ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెగా డీఎస్సీలో ఎస్టీలకు 2,024 పోస్టులు

ABN, Publish Date - May 03 , 2025 | 12:57 AM

మెగా డీఎస్‌సీలో గిరిజనులకు 2,024 టీచర్‌ పోస్టులు కేటాయించామని, గిరిజన యువత వైసీపీ నేతల మాయమాటల్లో పడి మోసపోవద్దని, గిరిజన నిరుద్యోగులకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఽశుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో టీచర్‌ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని, సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జీవో-3ను పునరుద్ధించాలనే డిమాండ్‌పై మన్యంబంద్‌ చేపట్టిన సందర్భంగా ఆమె గిరిజనులకు భరోసా కల్పిస్తూ ప్రకటన చేశారు.

గుమ్మడి సంధ్యారాణి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి

జీవో-3కు ప్రత్యామ్నాయంగా మరో జీవో తెస్తాం

వైసీపీ నేతల మాయ మాటలను గిరిజన యువత నమ్మొద్దు

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి

పాడేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్‌సీలో గిరిజనులకు 2,024 టీచర్‌ పోస్టులు కేటాయించామని, గిరిజన యువత వైసీపీ నేతల మాయమాటల్లో పడి మోసపోవద్దని, గిరిజన నిరుద్యోగులకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఽశుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో టీచర్‌ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని, సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జీవో-3ను పునరుద్ధించాలనే డిమాండ్‌పై మన్యంబంద్‌ చేపట్టిన సందర్భంగా ఆమె గిరిజనులకు భరోసా కల్పిస్తూ ప్రకటన చేశారు. జీవో-3 రద్దు పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని, తమ ప్రభుత్వం జీవో-3కు ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో గిరిజనులకు లబ్ధి కలిగేలా మరో జీవోను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నదన్నారు. తాజా మెగా డీఎస్‌సీలో మొత్తం 16,437 పోస్టుల్లో గిరిజనులకు 2,024 పోస్టులు కేటాయించామన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ పోస్టును భర్తీ చేయలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తే, గిరిజనులను తప్పుదారి పట్టించి బంద్‌లు, ధర్నాలు వంటి ఆందోళనలు చేయడం తగదన్నారు. వైసీపీ నేతల మాయ మాటల్లో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, గిరిజన అభ్యర్థులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సంధ్యారాణి స్పష్టం చేశారు.

గిరిజనులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: కలెక్టర్‌

పాడేరు, మే 2(ఆంధ్రజ్యోతి): జీవో-3ను సుప్రీం కోర్టు గతంలో రద్దు నేపథ్యంలో మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో-3 తరహాలో గిరిజనులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Updated Date - May 03 , 2025 | 12:57 AM