ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

12 కిలోల గంజాయి స్వాధీనం

ABN, Publish Date - May 15 , 2025 | 12:02 AM

మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని నక్కపల్లి సీఐ కె.కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు.

గంజాయి నిందితులతో సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు

ఇద్దరి అరెస్టు

నక్కపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని నక్కపల్లి సీఐ కె.కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నట్టు సమాచారం రావడంతో సిబ్బందితో అక్కడకు వెళ్లినట్టు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. తమను చూసి ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగులను పట్టుకుని వెళ్తుండగా, అనుమానం వచ్చి పట్టుకున్నామన్నారు. ఆరు ప్యాకెట్లతో వున్న 12 కిలోల గంజాయిని పట్టుకుని, కర్ణాటకకు చెందిన మునివెంకటప్ప, తమిళనాడుకు చెందిన కుప్పముత్తుల ను అరెస్టు చేసినట్టు చెప్పారు. మునివెంకటప్ప గతంలో ఒక హత్య కేసులో నిందితుడని, కుప్పముత్తు గంజాయి కేసులో నిందితుడని తెలిపారు. ఏజెన్సీ నుంచి బ్యాగుల్లో గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నామని చెప్పారు.

Updated Date - May 15 , 2025 | 12:02 AM