ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

85 చోరీ కేసుల్లో 112 మంది అరెస్టు

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:21 PM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత నెలలో జరిగిన 85 చోరీ కేసులను ఛేదించి నేరాలకు పాల్పడిన 112 మంది నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

చోరీ సొత్తును బాధితులకు అందజేస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత నెలలో జరిగిన 85 చోరీ కేసులను ఛేదించి నేరాలకు పాల్పడిన 112 మంది నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో చోరీల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే... నమోదైన చోరీ కేసులను ప్రత్యేక శ్రద్ధతో ఛేదించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే గతనెలలో జరిగిన మూడు దోపిడీలు, నాలుగు పగటిపూట ఇళ్లలో చోరీలు, రాత్రిపూట ఎనిమిది ఇళ్లలో జరిగిన దొంగతనాలు, నాలుగు చైన్‌ స్నాచింగ్‌లు, 21 మోటార్‌ సైకిళ్ల చోరీలు, 45 ఇతర చోరీలను ఛేదించామన్నారు. నిందితుల వద్ద నుంచి 1026.6 గ్రాముల బంగారం, 1.61 కిలోల వెండి, రూ.9.49 లక్షల నగదు, 22 బైకులు, 324 సెల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, ఐదు మేకలు, ఐదు లారీల బ్యాటరీలను రికవరీ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.95.40 లక్షలు ఉంటుందని సీపీ వివరించారు. అనంతరం జరిగిన క్రైమ్‌ మేళాలో రికవరీ చేసిన సొత్తును బాధితులకు సీపీ చేతులు మీదుగా అందజేశారు. సమావేశంలో క్రైమ్‌ డీసీపీ లతామాధురి, క్రైమ్‌ ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:21 PM