ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దనందుకు తల్లిపై కత్తి

ABN, Publish Date - Feb 01 , 2025 | 05:10 AM

విశాఖలోని మల్కాపురం కోస్ట్‌ గార్డు ప్రధాన కార్యాలయ కార్టర్స్‌లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

  • ఆమె అక్కడికక్కడే మృతి..

  • అతడికి మతిస్థిమితం లేదంటున్న బంధువులు

  • విశాఖ కోస్ట్‌గార్డు కమాండర్‌ ఇంట్లో విషాదం

మల్కాపురం(విశాఖపట్నం), జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని మందలించడంతో తల్లిపై కత్తిదూశాడో యువకుడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విశాఖలోని మల్కాపురం కోస్ట్‌ గార్డు ప్రధాన కార్యాలయ కార్టర్స్‌లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన బల్బీర్‌సింగ్‌ గత ఏడాది అక్టోబరులో బదిలీపై విశాఖ కోస్ట్‌గార్డు కమాండర్‌గా వచ్చారు. మల్కాపురం సమీప కోస్ట్‌గార్డు ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ లో భార్య ఆల్కాసింగ్‌(47), పెద్ద కుమారుడు హనుమాన్‌సింగ్‌(20), చిన్న కుమారుడు ఆయూష్మాన్‌సింగ్‌లతో ఉంటున్నారు. హనుమాన్‌సింగ్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడిన అతడు జనవరి 27న తల్లిదండ్రులిద్దరి ఖాతాల నుంచి చోరో రూ.15వేలు డ్రా చేసి, ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పోగొట్టాడు. విషయం తెలిసి తల్లిదండ్రు లు అతడి వద్దనున్న సెల్‌ ఫోన్‌, ల్యాప్‌టా్‌పలను లాక్కుని దాచిపెట్టారు. మర్నాడు బల్బీర్‌సింగ్‌ విధుల నిమిత్తం ఒడిశాలోని బరంపురం వెళ్లగా, తన సెల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకామె ససేమిరా అనడంతో బెడ్‌రూంలో ఉన్న తల్లిపై హనుమాన్‌సింగ్‌ కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ఆ గదికి తాళం వేసి ఏమీఎరగనట్టు ఉండిపోయాడు. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన చిన్నకొడుకు తల్లి గురించి అడగ్గా ఇంట్లో లేదని హనుమాన్‌బదులిచ్చాడు. తండ్రికి చిన్నకొడుకు ఫోన్‌ చేసి చెప్పగా, ఆయన కోస్ట్‌గార్డు సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించారు. గార్డులు వెళ్లి తాళం వేసి ఉన్న బెడ్‌రూంను తెరిచిచూస్తే, లోపల ఆల్కాసింగ్‌ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. మరోవైపు హనుమాన్‌సింగ్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని బంధువులు చెబుతున్నారు. బీటెక్‌ చదువుతున్నా హనుమాన్‌సింగ్‌ అప్పుడప్పుడూ ఇంట్లో దుస్తులు లేకుండా తిరిగేవాడని పనిమనిషి వెల్లడించింది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:11 AM