ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: పీఠం వెనెుక మోసం

ABN, Publish Date - Mar 19 , 2025 | 03:30 AM

విశాఖ శారదా పీఠం అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. జగన్‌ హయాంలో ఈ పీఠానికి భీమిలిలో 270 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారు.

  • శారదా పీఠంలో భారీ ఆక్రమణలు

  • జగన్‌ హయాంలో 270 కోట్ల విలువైన భూముల కేటాయింపు

  • అక్కడ వాణిజ్య అవసరాలకూ అనుమతి

  • అయినా, తీరని పీఠం భూదాహం

  • చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ

  • రోడ్డు భూమినీ వదలకుండా నిర్మాణాలు

  • అప్పట్లోనే సర్వేకు రెవెన్యూ ప్రయత్నాలు

  • అడ్డుకున్న నాటి సీఎంవో, పెద్దలు

  • కూటమి ప్రభుత్వంలోనూ ‘పీఠం’ దౌర్జన్యం

  • అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగింత

  • సాంకేతికత ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే

  • బయటపడ్డ రూ.కోట్ల ఆక్రమణలు.. సర్కారుకు నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశాఖ శారదా పీఠం అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. జగన్‌ హయాంలో ఈ పీఠానికి భీమిలిలో 270 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. ఆ భూములను వాణిజ్య అవసరాలకు కూడా వాడుకుంటామంటే... సరే అని జగన్‌ అనుమతులు ఇచ్చారు. అయితే... ఇటు భీమిలిలో, అటు పెందుర్తి మండలం చినముషిడివాడలో పీఠానికి ఎన్ని భూములు ఉన్నాయి? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి ఎంత? ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలో భారీ నిర్మాణాలు ఎందుకు చేయాలనుకుంటోందన్న అనుమానాలపై 2024లో ఎన్నికలకు ముందే అధికారులు విచారణ చేశారు. అప్పట్లో పెందుర్తిలో ఉన్న పీఠం ప్రధాన భూములను సర్వేచేయాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా వైసీపీ పెద్దలు అడ్డుకున్నారు. నేరుగా నాటి సీఎం కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులకు ఫోన్‌లు వెళ్లాయి. తమాషాలు చేస్తున్నారా... పీఠం భూముల గురించి మీకెందుకు...అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు.


ప్రభుత్వం మారాక...

2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు మరోసారి పాత ఫైళ్లను తిరగేశారు. భీమిలిలో ఇచ్చిన విలువైన భూములను వాణిజ్య అవసరాలకు వాడుకోవద్దని రెవెన్యూశాఖ అభ్యంతరం పెట్టింది. తర్వాత ఆ భూ కేటాయింపులనే రద్దుచేసింది. అనంతరం పెందుర్తి మండలం చినముసిడివాడలో శారదాపీఠం చుట్టు ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించారు. సర్వే నంబర్‌ 87/1, 90, 91/1, 91/3, 91/9లోని భూముల్లో శారదా పీఠం ఉంది. ఇదే సర్వేనంబర్ల పరిధిలో ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ భూముల లెక్క తేల్చడానికి గత ఏడాది నవంబరులో రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా పీఠం పెద్దలు అడ్డుకున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులను పీఠానికి సంబంధించిన మనుషులు నిరోధించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సర్వే నిర్వహించారు. గూగుల్‌ చిత్రాలు, ఎఫ్‌ఎంబీ (ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్‌)ను ఉపయోగించి ఆక్రమణల గుట్టు తేల్చారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న ఫెయిర్‌ అడంగల్‌లోని రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూములకు మార్కింగ్‌ చేయగా, భారీగా ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నట్లుగా తేలింది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే... ఆక్రమణల గుట్టు మరింత రట్టు అయ్యే అవకాశముంది. ప్రాథమిక పరిశీలన ప్రకారం...

  • సర్వే నంబర్‌ 87/1లో ఇనాం భూమి ఉంది. విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ ఆమోదించిన లేవుట్‌ ప్లాన్‌లో 30 అడుగుల రోడ్డు (ఎల్‌పీ నం. 11/86) ఉంది. ఈ సర్వే నంబర్‌లో 35 సెంట్ల భూమిని పీఠం ఆక్రమించుకున్నట్లుగా తేల్చారు. ఇందులో పీఠం కార్యాలయం, అతిథిగృహం, స్వామీజీ పీఠం ఏర్పాటుచేశారు. బీటీరోడ్డు, ప్రధాన గేటును ఏర్పాటు చేశారు.

  • సర్వే నంబర్‌ 90లో 22 సెంట్ల భూమిని పీఠం తన అధీనంలోకి తీసుకుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి రహదారి. దీన్ని పీఠం ఆక్రమించుకొని ఆలయం నిర్మించింది. పెద్ద బీటీ రోడ్డు వేసింది. పీఠం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ సగం ఈ భూమిలోనే ఉన్నదని గుర్తించారు.


  • సర్వే నంబర్‌ 91/2లో సర్కారు పుంజగా (ప్రభుత్వ భూమి) రికార్డులో గల 2.96 ఎకరాల భూమి ఉంది. 91/3 సర్వే నంబర్‌లో 1.30 ఎకరాల భూమి ఉంది. 1.38 ఎకరాల భూమిని పీఠం హస్తగతం చేసుకున్నట్లు గుర్తించారు. ఈ భూమిలో వేదపాఠశాల, విద్యార్ధులు, ఉపాధ్యాయుల వసతిగృహాలు నిర్మించినట్లు నిర్ధారించారు.

  • సర్వే నంబర్‌ 91/9లో 4.15 ఎకరాల భూమి ఉంది. ఇందులో మూడు ఆలయాలు నిర్మించారు. పీఠం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ సగం ఇందులోనే ఉంది. కొంత భూమిని ఓపెన్‌ స్థలంగా వాడుకుంటున్నారు.

  • 1.50 ఎకరాల భూమిని పీఠం కబ్జా చేసినట్లు గుర్తించారు. మరో గెడ్డ కూడా పీఠంలో కలిసిందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండింటిని కలిపితే రెండున్నర ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లుగా భావించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


పీఠంలోకి అడుగుపెట్టగలరా?

జగన్‌ ప్రభుత్వంలో పీఠం పరిసరాల్లోకి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా నాటి ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. గత నవంబరులో భూముల సర్వేకు అధికారులు వెళ్లగా పీఠం ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో గూగుల్‌ మ్యాప్స్‌, ఇతర శాటిలైట్‌ ఇమేజెస్‌, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి పీఠం ఆక్రమణలపై ప్రాఽథమిక నిర్థారణకు వచ్చారు. అయితే, పీఠం లోపలకు వెళ్లి సర్వే చేయగలిగితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆక్రమించిన భూముల పరిమాణం కూడా పెరిగే వీలుంది. కానీ, ఇది అయ్యేపనేనా? ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి పీఠంలోకి వెళ్లి సర్వే చేయడానికి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - Mar 19 , 2025 | 03:30 AM