Ap High Court: భూ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు
ABN, Publish Date - May 28 , 2025 | 06:01 AM
భూవివాదాల్లో సామరస్యపూర్వక పరిష్కారం పేరుతో పోలీసులు జోక్యం చేసుకోవడం హైకోర్టు తప్పుపట్టింది. పీఎల్‌సీఎఫ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం సరికాదని, దావా ఉపసంహరణకు ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసింది.
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): సామరస్యపూర్వక పరిష్కారం పేరుతో పోలీసులు భూవివాదాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరమ్ (పీఎల్‌సీఎఫ్) పేరుతో సివిల్ వివాదాలతో సంబంధం ఉన్న వ్యక్తులను విశాఖ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. భూవివాదాల పరిష్కారం విషయంలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు.
దావా ఉపసంహరణకు ఒత్తిడి చేయవద్దు
దర్శి కోర్టులో తాను దాఖలు చేసిన దావాను ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా ముండ్లమూరు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ బసవపురానికి చెందిన కె.వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు దావాను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 06:01 AM