Visakhapatnam Metro: అక్టోబరులో విశాఖ మెట్రో పనులు ప్రారంభం
ABN, Publish Date - May 22 , 2025 | 06:11 AM
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు అక్టోబర్ నుండి ప్రారంభిస్తామని మంత్రి పి. నారాయణ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తి కానుంది, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.ఏడు వేల కోట్లు విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
టిడ్కో లబ్ధిదారులకు దసరాకు ఇళ్లు: మంత్రి నారాయణ
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు అక్టోబరులో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ వెల్లడించారు. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కార్యాలయంలో ఆయన బుధవారం అనేక అంశాలపై ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖలో మెట్రో రైలును డబుల్ డెక్కర్ మోడల్‌లో నడపడానికి డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి సమర్పించామన్నారు. విశాఖ ప్రజలకు ఉపయోగపడేలా సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందని, దానికి అనుసంధానం చేస్తూ 22 రహదారులను ప్రతిపాదించగా, 15 రహదారుల పనులు మొదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన వాటికి ప్రణాళికలు తయారవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2014-19 మధ్య ఏడు లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించామని, గత ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని మంత్రి నారాయణ అన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి రూ.ఏడు వేల కోట్లు అవసరమని, ఎంతైనాసరే ఖర్చు చేసి ఈ దసరాకే వాటిని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించామన్నారు. అమృత్ పథకం కింద రూ.834 కోట్లతో తాగునీటి పనులు చేపట్టనున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 06:11 AM