Task Force Police: విజయవాడలో డ్రగ్స్ కలకలం
ABN, Publish Date - Jul 13 , 2025 | 05:19 AM
బెంగళూరు నుంచి డ్రగ్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు కొనుగోలు చేస్తున్న యువకుడ్ని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
టెకీ, ఇంజనీరింగ్ విద్యార్థి సహా ముగ్గురు యువకుల అరెస్టు
విజయవాడ, జూలై 12(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి డ్రగ్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు కొనుగోలు చేస్తున్న యువకుడ్ని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామానికి చెందిన గవర శ్రీరామ వెంకట మణికంఠ అమరావతి విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. విట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన దేశబోయిన ఆకాష్ అక్కడే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని అక్కడి నుంచి డ్రగ్‌ను తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి వారం క్రితం డ్రగ్ కొనుగోలు చేశాడు. అంబాపురంలో శివకుమార్ కౌశిక్ అనే యువకుడికి డ్రగ్‌ను విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముగ్గురు యువకులను అరెస్టు చేసి ఐదు గ్రాముల మెథాంఫెటమిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. బెంగళూరులో గ్రాము రూ. 4 వేలకు కొని విజయవాడలో రూ. 9-12 వేలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Updated Date - Jul 13 , 2025 | 05:21 AM