ఏలూరు, కైకలూరు వైస్ ఎంపీపీలకు 27న ఉప ఎన్నిక
ABN, Publish Date - Mar 20 , 2025 | 12:26 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ పదవులకు, ఒక కో ఆప్షన్ సభ్యునికి ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది.
ఏలూరు సిటీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ పదవులకు, ఒక కో ఆప్షన్ సభ్యునికి ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. వీటిలో యలమంచిలి, అత్తిలి ఎంపీపీలకు, ఏలూరు రూరల్, అత్తిలి, కైకలూరు వైస్ ఎంపీపీ పదవులకు, పెరవలి కో ఆప్షన్ సభ్యుడి పద వికి ఎన్నిక జరగనుంది. వీటికి సంబంధించి 27వ తేదీ ఉదయం పది గంటలలోగా నామి నేషన్ల స్వీకరణ, 12 గంటల్లోగా పరిశీలించి, అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు ఒంటి గంటలోగా గడువు విధించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు.
Updated Date - Mar 20 , 2025 | 12:26 AM