Vice President Venkaiah Naidu: అన్నప్రసాదం ఎంతో రుచిగా, శుచిగా ఉంది
ABN, Publish Date - Jul 28 , 2025 | 05:00 AM
గవంతుడి అన్నప్రసాదం స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. పైగా ఎంతో రుచిగా, శుచిగా ఉంది అంటూ టీటీడీ అన్నప్రసాదాలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.
తిరుమలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తిరుమల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘భగవంతుడి అన్నప్రసాదం స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. పైగా ఎంతో రుచిగా, శుచిగా ఉంది’ అంటూ టీటీడీ అన్నప్రసాదాలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుని భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి అన్నప్రసాద భవనంలోని కామెంట్ బుక్‌లో ‘భోజనం రుచిగా, శుచిగా, చక్కగా ఉన్నది. భగవంతుడి సన్నిధిలో భోజనం చేయడం భగవత్ ప్రసాదం’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, భోజన సమయంలోమసాలా వడ ప్రసాదంపై టీటీడీ చైర్మన్‌తో మాట్లాడుతూ.. మసాలా వడలకు నెల్లూరు ఫేమస్ అని, ఈ వడలు తింటుంటే నెల్లూరు గుర్తుకువస్తోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీవారి సేవకులతో కొద్ది సమయం ముచ్చటించారు. కాగా, సోమవారం ఉదయం వెంకయ్య నాయుడు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దేవస్థానం నిధులు వేరేవాటికి వాడకూడదు
అతిథి గృహంలో వెంకయ్యనాయుడిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. నిధుల విషయంలో చైర్మన్ చాలా గట్టిగా ఉన్నారనే విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్న క్రమంలో వెంకయ్య నాయుడు స్పందిస్తూ ‘అలానే ఉండాలి. దేవస్థానం నిధులను ధర్మప్రచారం, దేవాలయాల పునరుద్ధరణకు తప్ప వేరేవాటికి వాడనే వాడకూడదు’ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 28 , 2025 | 05:03 AM