GVMC: విశాఖ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరాజు ఏకగ్రీవం
ABN, Publish Date - May 21 , 2025 | 04:04 AM
జనసేన పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో ఉప ఎన్నిక జరిగింది.
జనసేన తరఫున రంగంలోకి మద్దతు ప్రకటించిన 52 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎమ్మెల్యేలు
విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా జనసేన పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వైసీపీ నేత జియ్యాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్త డిప్యూటీ మేయర్ ఎన్నిక నిమిత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సోమవారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, కోరం లేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఎన్నికల అధికారి హోదాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్.. కౌన్సిల్ హాల్‌కు చేరుకుని సమావేశానికి హాజరైన వారిని లెక్కించారు. ఎన్నిక నిర్వహించడానికి 56 మంది సభ్యులు అవసరమని పేర్కొన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, 52 మంది కార్పొరేటర్లు అప్పటికి హాజరైనట్టు అధికారులు నివేదించడంతో సమావేశాన్ని ప్రారంభించారు. డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరాజు పేరును విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్‌రాజు బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. వెంటనే దల్లి గోవిందరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 04:04 AM