Supreme Court: వాన్‌పిక్ కేసు విచారణ.. 4 వారాలకు వాయిదా
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:46 AM
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన వాన్‌పిక్ (వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ర్టియల్ కారిడార్ ప్రాజెక్ట్స్) భూముల కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన వాన్‌పిక్ (వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ర్టియల్ కారిడార్ ప్రాజెక్ట్స్) భూముల కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చడంపై వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును గతేడాది మే 30న ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలను నాలుగు వారాల తర్వాత వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల జాబితా ప్రకారం ఆగస్టు 26న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశముంది.
Updated Date - Jul 23 , 2025 | 04:47 AM