Vakadu Tahsildar: తహసీల్దార్ నగ్న వీడియోలు వైరల్
ABN, Publish Date - Aug 01 , 2025 | 04:43 AM
తిరుపతి జిల్లాలో మహిళా వీఆర్వోను లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో వాకాడు తహసీల్దారు రామయ్యను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు.
లైంగికంగా వేధించారని వీఆర్వో ఫిర్యాదు
రూ.కోటి ఇవ్వాలని ఇద్దరు విలేకర్లతో కలిసి వీఆర్వో బ్లాక్ మెయిల్ చేశారన్న తహసీల్దార్
వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్.. విచారణకు ఆదేశం
తిరుపతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో మహిళా వీఆర్వోను లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో వాకాడు తహసీల్దారు రామయ్యను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై గురువారం ఆయన విచారణకు ఆదేశించారు. ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్‌ను విచారణాధికారిగా నియమించారు. జూలై 24న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గ్రామ వీఆర్వో కళ్యాణి నాయుడుపేటలో నివాసముంటున్నారు. 24న ఆమె ఇంట్లో వాకాడు తహసీల్దారు రామయ్య నగ్నంగా ఉన్న దృశ్యాలు, వీఆర్వో తల్లి అతన్ని కొడుతున్న దృశ్యాలు గురువారం సామాజిక మాఽఽధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తనను వాకాడు తహసీల్దారు రామయ్య లైంగికంగా వేధిస్తున్నాడంటూ కళ్యాణి గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరును కలిసి మౌఖికంగా ఫిర్యాదుచేశారు. అయితే బుధవారం రాత్రే తహసీల్దారు రామయ్య కూడా కలెక్టరును కలిసి తనను ఇద్దరు విలేకర్లతో కలిసి వీఆర్వో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. గురువారం సాయంత్రం ఆయన జిల్లా ఎస్పీని కలిసి విలేకరులు తనను రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన ఆధారాలను కూడా ఫిర్యాదుతోపాటు సమర్పించినట్టు తెలిసింది.
Updated Date - Aug 01 , 2025 | 04:45 AM