Holi: ‘మగ’ మహారాణులు!
ABN, Publish Date - Mar 15 , 2025 | 04:19 AM
కర్నూలు జిల్లా ఆదోనిలో మాత్రం హోలీ పండుగ ప్రత్యేకతే వేరు. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా వింత ఆచారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో రెండ్రోజుల పాటు పురుషులు మహిళల్లా అలంకరించుకుంటారు.
కర్నూలు జిల్లాలో తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
రెండ్రోజుల పాటు వింతైన వేడుక
ఆదోని రూరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): హోలీ అంటేనే సంబరాల పండుగ. వసంత మాసం ఆగమనం సందర్భంగా చేసుకునే సరదాల వేడుక. హోలీ సందర్భంగా చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోతారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాత్రం హోలీ పండుగ ప్రత్యేకతే వేరు. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా వింత ఆచారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో రెండ్రోజుల పాటు పురుషులు మహిళల్లా అలంకరించుకుంటారు. ఖరీదైన చీరలు, లంగా ఓణీలు ధరించి, ఒంటి నిండా నగలు పెట్టుకుని, పూలతో అలంకరించుకుంటారు. ఆడవాళ్లే ఆశ్చర్యపోయేలా అందంగా ముస్తాబవుతారు. అదే వేషధారణలో పురుషులు గ్రామంలోని బసవేశ్వరస్వామి దేవాలయంలోని రతీమన్మథుల విగ్రహాలకు పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా ఇలా మహిళల మాదిరిగా తయారై రతీమన్మథుడికి నైవేద్యాన్ని ప్రత్యేకంగా తీసుకుని వస్తారు. మగవారు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకోవడంతో గ్రామంలో కరువు, కాటకాలు ఉండవని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఏటా హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూసేందుకు భారీగా తరలివస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 15 , 2025 | 04:19 AM