Bhupathiraju Srinivasa varma : సామాన్య.. మధ్యతరగతికి మేలు చేసే బడ్జెట్
ABN, Publish Date - Feb 02 , 2025 | 04:28 AM
కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
స్టీల్‌ప్లాంట్‌కు రూ.3 వేల కోట్ల కేటాయింపు: శ్రీనివాసవర్మ
న్యూఢిల్లీ, భీమవరం టౌన్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత రీతిలో ప్రాధాన్యం దక్కిందన్నారు. సవరించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఆమోదిస్తూ బడ్జెట్‌లో ప్రస్తావన ఉందన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా రూ.35,400 కోట్లలో ఇంకా రూ.12 వేల కోట్లు ఇస్తామని బడ్జెట్ స్పష్టం చేసిందన్నారు. జలజీవన్ మిషన్ పనుల పొడగింపుతో రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉద్యోగులకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ 8,400వేల కోట్లు, కొత్త బడ్జెట్‌లో దాదాపు రూ.3 వేల కోట్లు కేటాయింపులు జరిగాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్థికి కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ నిరూపించిందని చెప్పారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 02 , 2025 | 04:29 AM