Ongole: చిన్నారిపై లైంగిక దాడి
ABN, Publish Date - May 22 , 2025 | 06:03 AM
ఒంగోలులోని నాగేంద్రనగర్‌లో తల్లిదండ్రులు లేని సమయంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా, తొమ్మిదేళ్ల, ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు బాలురపై కేసు నమోదు
ఒంగోలు క్రైం, మే 21(ఆంధ్రజ్యోతి): సభ్య సమాజం తలదించుకునేలా నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఒంగోలులోని నాగేంద్రనగర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పాప ఆడుకుంటుండగా తొమ్మిదేళ్లు, ఎనిమిదేళ్లు వయస్సు ఉన్న ఇద్దరు బాలురు వెళ్లి ఈ దురాగతానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడకి వచ్చిన బాలిక తల్లి.. పాపకు రక్తస్రావం కావడాన్ని గమనించి బాలురను నిలదీసింది. దీంతో సమీపంలో ఉన్న వారి తల్లిదండ్రులు వచ్చి బాలిక తల్లితో గొడవపడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. అనంతరం వారిని మహిళా పోలీసు స్టేషన్‌కు పంపగా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. బాలురపై కేసు నమోదు చేసినట్టు సీఐ సుధాకర్ తెలిపారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండిc
Updated Date - May 22 , 2025 | 06:03 AM