క్షయ ప్రాణాంతకమైన వ్యాధి కాదు
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:52 PM
క్షయ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, మందుల ద్వారా నయం చేసుకోవచ్చని అ దనపు డీఎంహెచవో శార దాబాయి అన్నారు.
చాగలమర్రి, జూన 19 (ఆంధ్రజ్యోతి): క్షయ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, మందుల ద్వారా నయం చేసుకోవచ్చని అ దనపు డీఎంహెచవో శార దాబాయి అన్నారు. గురువారం చాగలమర్రి గ్రామంలోని మూడవ సచివాలయం పరిధిలో సంచార చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ 2027 నాటికల్లా టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యమన్నారు. టీబీ ముక్తి భారత ప్రోగ్రామ్ కార్యక్రమం లో భాగంగా చక్కెర వ్యాధిగ్రస్థులు, తక్కువ బరువు ఉన్నవారు, ధూ మపానం, మద్యపానం తాగేవారు, 60 సంవత్సరాలు పైబడిన వారికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లాలో 26 కేసులు కొత్తగా నమోదయ్యాయని అన్నారు. అనంత రం ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు అంజలి, హెల్త్ సూపర్‌వైజర్ రామలింగారెడ్డి, ఆరోగ్య విస్తరణాధికా రులు వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, ఎంఎల్‌హెచపీ సురేంద్ర, ఏఎనఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:52 PM