ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IT Department: టీటీడీలో మరో ఐటీ జీఎం పోస్టు

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:32 AM

భక్తులకు వేగవంతంగా డిజిటల్ సేవలందించేందుకు టీటీడీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో డిప్యూటీ జీఎం పోస్టును ఐటీ జీఎంగా అప్‌గ్రేడ్‌ చేయాలని, రెండో జీఎం పోస్టు సృష్టించేందుకు ప్రభుత్వానికి లేఖ పంపింది.

ఆమోదం కోసం ప్రభుత్వానికి లేఖ

టీటీడీలో రోజురోజుకు డిజిటల్‌ సేవల్లో విస్తృతంగా పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ డిప్యూటీ జీఎంగా ఉన్న పోస్టును ఐటీ జీఎంగా పదోన్నతి కల్పించే అంశంపై టీటీడీ దృష్టిసారించింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, గదులు, లడ్డూప్రసాదం తదితర సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు సమర్థమైన పరిపాలనను అందించే దిశగా టీటీడీ అడుగులేస్తోంది. 1989లో టీటీడీలో కంప్యూటరైజేషన్‌ ప్రారంభం కాగా, 2002లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటైంది. ఇప్పటికే 108కిపైగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు అభివృద్ధి చేసి వినియోగిస్తున్నారు. శ్రీవారి ఆలయం, టీటీడీ పరిపాలన వ్యవస్థతో పాటు తిరుపతి స్థానిక ఆలయాల్లో ఐటీ సేవలను విస్తృతం చేయాలని టీటీడీ భావిస్తోంది. అలాగే టీటీడీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆస్పత్రులు, ఇతర ఆలయాలు, సమాచార కేంద్రాలకు కూడా ఐటీ అవసరాన్ని ప్రస్తుత అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఒకే ఐటీ జీఎంతో ఇవన్నీ చేయడం సాధ్యం కాదని భావించిన టీటీడీ, ఐటీ డిప్యూటీ జీఎం పోస్టును అప్‌గ్రేడ్‌ చేసి రెండో ఐటీ జీఎం పోస్టుగా క్రియేట్‌ చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఆమోదం కోసం టీటీడీ ఇటీవల ప్రభుత్వానికి లేఖ పంపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:32 AM