ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD smart sticks: శ్రీవారి భక్తులకు స్మార్ట్‌ రక్షణ..

ABN, Publish Date - May 29 , 2025 | 05:53 AM

టీటీడీ వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు స్మార్ట్‌ స్టిక్స్‌ను వినియోగంలోకి తీసుకుంది. ఈ స్టిక్స్‌లో టార్చ్‌, అలారం, కరెంట్‌ షాక్‌ డివైజ్ ఉంటాయి, వాటి ద్వారా వన్యమృగాలను భయపెడుతూ భక్తుల రక్షణ జరుగుతుంది.

వన్యమృగాల బెడదకు స్మార్ట్‌స్టిక్స్‌తో చెక్‌

దీనిలో టార్చ్‌, అలారం, కరెంట్‌ షాక్‌ డివైజ్‌

తిరుమల, మే 28 (ఆంధ్రజ్యోతి): చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగుల వంటి వన్యప్రాణుల నుంచి శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ స్మార్ట్‌ స్టిక్స్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే 20 ‘స్మార్ట్‌ స్టిక్స్‌’ను కొనుగోలు చేశారు.

స్మార్ట్‌ స్టిక్స్‌ ప్రత్యేకత ఏమిటి..?

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ స్టిక్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్నారు. నడక మార్గాల్లో వచ్చే భక్తులతో పాటు వచ్చే సెక్యూరిటీ, ఫారెస్ట్‌ సిబ్బంది వాడే ఈ స్మార్ట్‌ స్టిక్స్‌లో ఎక్కువ కాంతి వచ్చేలా టార్చ్‌, అలారం ఉంటాయి. వీటితోపాటు కింద భాగంలో కరెంటు షాక్‌ ఇచ్చే డివైజ్‌ను ఏర్పాటు చేశారు. వన్యమృగాలు చేరువగా వచ్చినప్పుడు ఈ స్మార్ట్‌స్టిక్స్‌లో ఉన్న అలారం మోగించవచ్చు. అయినా దగ్గరకు వస్తే స్టిక్‌లోని డివైజ్‌ను యాక్టివేట్‌ చేసి వాటికి కరెంట్‌ షాక్‌ ఇవ్వగానే భయంతో పారిపోతాయి. చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో మరో 20 స్మార్ట్‌ స్టిక్స్‌ను కొనుగోలు చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం ఫారెస్ట్‌ అధికారులను ఆదేశించారు.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:54 PM