పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం
ABN, Publish Date - May 31 , 2025 | 11:58 PM
మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంట్‌లను శనివారం ఎస్పీ విద్యాసాగర్‌నాయుడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
రాయచోటిటౌన, మే31(ఆంధ్రజ్యోతి): మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంట్‌లను శనివారం ఎస్పీ విద్యాసాగర్‌నాయుడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన తంబళ్లపల్లి పోలీ్‌సస్టేషన ఏఎ్‌సఐ సుబ్రమణ్యం, జిల్లా స్పెషల్ బ్రాంచ ఏఎ్‌సఐలు నారాయణరాజు, ఉమర్‌అలీ, సీనియర్ అసిస్టెంట్ ఎండీ హేమలతలను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరి 35 నుంచి 38 సంవత్సరాల పాటు సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఇతర శాఖల ఉద్యోగులు వేరు, పోలీసు ఉద్యోగం వేరని, కుటుంబ సభ్యులను వదిలి క్రమశిక్షణ, అంకిత భావంతో ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ ఎం. శ్రీనివాసులు, ఏఏవో జే.త్రినాథసత్యం, స్పెషల్ బ్రాంచ ఇనస్పెక్టర్ పీ.రాజారమేశ, రిజర్వ్ ఇన్సపెక్టర్లు వీజే రామక్రిష్ణ, ఎం.పెద్దయ్య, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 11:58 PM