ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Child Labor: వెట్టిచాకిరీకి బాలుడు బలి

ABN, Publish Date - May 22 , 2025 | 05:40 AM

బాతులు మేపే పనికి అడ్వాన్సుగా తీసుకున్న డబ్బు తిరగక చెల్లించలేక గిరిజన మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకును తాకట్టు పెట్టింది. తమిళనాడులో బాతులు మేపుతూ అనారోగ్యంతో మృతి చెందిన బాలుడి అస్థిపంజరం, పోలీసుల విచారణలో బయటపడింది.

తల్లి తీసుకున్న అడ్వాన్సు సొమ్ముకు బందీగా మారిన వైనం

సత్యవేడు నుంచి తమిళనాడుకు

బాతులు మేపేందుకు వెళ్లి శవమై తేలి

సత్యవేడు/తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి): బాతులు మేపే పనికి అడ్వాన్సు తీసుకున్న ఓ గిరిజన మహిళ నిస్సహాయత.. ఆమె తొమ్మిదేళ్ల చిన్నారి కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది! తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా పసివాడిని పనికి పెట్టుకున్న యజమాని నిర్దాక్షిణ్యంగా బాతులు మేపే పనికి తమిళనాడుకు పంపి ఆ పసివాడి ఉసురు తీశాడు! బిడ్డ ఆచూకీ కోసం ఎంత ప్రశ్నించినా యజమాని నోరుమెదపకపోవడంతో తల్లి సత్యవేడు పోలీసులను ఆశ్రయించింది. పోలీసు విచారణలో.. తమిళనాడులోని కంచి సమీపంలో బాతులు మేపేందుకు వెళ్లి అనారోగ్యంతో మరణించిన బాలుడిని అక్కడే పాతిపెట్టినట్టు వెల్లడైంది. బుధవారం సత్యవేడు, కంచి పోలీసులు అక్కడ తవ్వించగా బాలుడి అస్తిపంజరం బయటపడింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసుల కథనం ఇలా ఉంది. తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు పంచాయతీ చవట గిరిజన కాలనీకి చెందిన అంకమ్మ, చెంచయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. ట్రాక్టర్‌ కూలీగా పనిచేసే చెంచయ్య నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (9), కుమార్తెను వెంటతీసుకుని కూలి పనులకు సత్యవేడు పంచాయతీ దళవాయి అగ్రహారానికి వచ్చింది. రెండేళ్ల క్రితం అక్కడ బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిలో చేరింది.


పది నెలల క్రితం పని మానేయడంతో అడ్వాన్సు తిరిగివ్వాలని యజమాని ముత్తు పట్టుబట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె.. తాను డబ్బులు తిరిగి చెల్లించేదాకా తన తొమ్మిదేళ్ల కొడుకు వెంకటేశ్వర్లును బాతులు మేపే పనికి పెట్టుకోవాలని అక్కడే వదిలిపెట్టి స్వగ్రామానికి వెళ్లింది. గత నెల రోజులుగా కొడుకు నుంచి ఫోన్‌ కాల్స్‌ రాకపోవడంతో దళవాయి గ్రామానికి వచ్చిన ఆమె.. తన కొడుకు ఎక్కడని ముత్తును ప్రశ్నించింది. రోజులు గడుస్తున్నా కొడుకు జాడ తెలియకపోవడంతో అంక మ్మ సత్యవేడు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముత్తును అదుపులోకి తీసుకుని విచారించగా.. బాతులు మేపేందుకు బాలుడిని తమిళనాడులోని కంచి ప్రాంతానికి పంపించారని, అక్కడ అనారోగ్యానికి గురై చనిపోతే మృతదేహాన్ని ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారని తేలింది. దీంతో సత్యవేడు పోలీసులు కంచికి చేరుకుని అక్కడి పోలీసుల సాయంతో బుధవారం బాలుడి మృతదేహాన్ని పూడ్చిన చోట తవ్వించగా అస్తిపంజరం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం ఆ అవశేషాలను చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తొమ్మిదేళ్ల బాలుడు వెట్టిచాకిరీ చేస్తుండగా ప్రభుత్వ యం త్రాంగం గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 05:41 AM