ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాన్యువల్‌ విధానంలో బదిలీలు చేపట్టాలి

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:43 PM

సెకండ్‌గ్రేడ్‌ ఉపాధ్యాయులకు మ్యానువల్‌ విధానంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టాలని శనివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): సెకండ్‌గ్రేడ్‌ ఉపాధ్యాయులకు మ్యానువల్‌ విధానంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టాలని శనివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్‌ విదానంలో చేపడుతామని హామీ ఇచ్చి నేడు వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టడం తగదన్నారు. వెబ్‌కౌన్సెలింగ్‌ విదానంలో ఒక్కో ఉపాధ్యాయుడు వేలకొద్ది పాఠశాలలను ఎంపిక చేసుకోవడం కష్టసాధ్యమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్‌జీటీలకు మాన్యువల్‌ విధానంలో కౌన్సెలింగ్‌ చేపట్టడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం డీఈవో కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు శ్రీనివాసరెడ్డి, సుబ్రమణ్యం, సలీం, సుబ్బయ్య, లక్ష్మినారాయణరెడ్డి, జాన్‌, సురేష్‌, ఓబుళరెడ్డి, బాలయ్య, అల్లాబకాస్‌, మోహన్‌రెడ్డి, జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో: ఎస్‌జీటీలకు వెబ్‌ కౌన్సెల్‌ ద్వారా కాకుండా మాన్యువల్‌ విధానంలో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘా ల ఐక్యవేదిక నాయకులు డిమాం డ్‌ చేశారు. శనివారం స్థానిక ఎం ఈవో కార్యాలయం ఎదుట ఉపా ధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యఉపాధ్యాయ సంఘం నాయకులు రామక్రిష్ణారెడ్డి, చెన్నయ్య యాదవ్‌, వారణాసి రవి, భూపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయులకు ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంద న్నారు. ఇందులో నష్టపోయే అవకాశం కూడా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం స్పందించకుంటే డీఈవో కార్యాలయం ముట్టడి చేపట్టడం జరుగుతుందన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:43 PM