ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జర్మనీలో ఉద్యోగావకాశాల కల్పనకు శిక్షణ

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:04 AM

ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సింగ్‌ అభ్యర్థుల కోసం జర్మనీలో ఉద్యోగ అవకాశం కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉద్యోగకల్పన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా అధికారి శ్రీకాంతరెడ్డి తెలిపారు.

నంద్యాల ఎడ్యుకేషన, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సింగ్‌ అభ్యర్థుల కోసం జర్మనీలో ఉద్యోగ అవకాశం కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉద్యోగకల్పన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా అధికారి శ్రీకాంతరెడ్డి తెలిపారు. శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మహిళా నర్సింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ, జర్మనీలో ఉద్యోగ అవకాశం కల్పించేలా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. 35యేళ్లలోపు వయస్సు ఉండి, జీఎనఎం మూడు సంవత్సరాలు, బీఎస్సీ రెండేళ్లు చదివి అనుభవం కల్గిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అన్నారు. 8 నెలల నుంచి 10 నెలలు శిక్షణా కాలం ఉంటుందని, ఆ సమయంలో ఉచిత భోజనం మరియు వసతి కల్పిస్తామన్నారు. ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Updated Date - Aug 01 , 2025 | 12:04 AM