పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించాం: మంత్రి దుర్గేశ్
ABN, Publish Date - Jul 29 , 2025 | 05:55 AM
పర్యాటక రంగానికి గత ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. మేము మళ్లీ పట్టాలెక్కించి ముందుకు తీసుకెళుతున్నాం అని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
తిరుమల, జూలై 28(ఆంద్రజ్యోతి): ‘పర్యాటక రంగానికి గత ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. మేము మళ్లీ పట్టాలెక్కించి ముందుకు తీసుకెళుతున్నాం’ అని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. సోమవారం తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు.‘టూరిజం రంగానికి సంబంధించి హోటళ్లకు పారిశ్రామిక హోదా కల్పన, నూతన పాలసీ ప్రకటించడంతో తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సముద్ర తీరం పొడవునా బీచ్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌ను పూర్తిస్థాయిలో తీసుకురావడానికి చర్యలు తీసుకున్నాం’ అని మంత్రి తెలిపారు.
Updated Date - Jul 29 , 2025 | 05:56 AM