ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయిలో టాప్‌టెన అవార్డులు

ABN, Publish Date - May 07 , 2025 | 11:18 PM

సాంఘిక సంక్షేమశాఖ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో పది, సీనియర్‌ ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాఽ దించిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహక అవార్డులను అందజేసింది.

విజయవాడలో అవార్డులు పొందిన విద్యార్థులు

ఉమ్మడి జిల్లాల్లో 24మందికి అవార్డులు

అవార్డులు అందజేసిన మంత్రులు డోలావీరాంజనేయులు,

నంద్యాల ఎడ్యుకేషన, మే 7(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమశాఖ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో పది, సీనియర్‌ ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాఽ దించిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహక అవార్డులను అందజేసింది. పదవ తరగతి, సీనియర్‌ ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, గిరిజన విద్యార్థులకు బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి చేతులమీదుగా అవార్డులు అందజేశారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అత్యధికంగా 24 మంది విద్యార్థులు ప్రోత్సాహక అవార్డులు కైవసం చేసుకున్నారు.

అవార్డులు పొందిన విద్యార్థులు

ఫ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు

ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యధికంగా 11 అవార్డులను కైవసం చేసుకున్నారు. పదవ తరగతిలో ఆళ్లగడ్డ ఆర్‌పీఆర్‌పీ పాఠశాలకు చెందిన కీర్తన 590 మార్కులతో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. కర్నూలు దిన్నెదేవరపాడు పాఠశాలకు చెందిన ప్రమీల 587 మార్కులతో 4వ ర్యాంకు, ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలకు చెందిన వర్షిత 585 మార్కులతో 6వ ర్యాంకర్‌గా, కర్నూలు వెల్దుర్తి పాఠశాలకు చెందిన దివ్య 584 మార్కులతో 7వ ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే ఆళ్లగడ్డ ఆర్‌పీఆర్‌పీ పాఠశాలకు చెందిన సుధ 578 మార్కులు, ప్రియాంక 578 మార్కులుతో సిల్వర్‌ ర్యాంకర్‌గా నిలిచారు. సీనియర్‌ ఇంటర్‌లో పత్తికొండ గురుకులానికి చెందిన మల్లిక 983 మార్కులతో మూడవర్యాంక్‌, లక్ష్మాపురం గురుకులానికి చెందిన ఆనందజ్యోతి 983 మార్కులతో 3వ ర్యాంక్‌ సాధించారు. అలాగే వెల్దుర్తి గురుకులం కళాశాల విద్యార్థిని అంకిత బైపీసీలో 980 మార్కులు, చిన్నటేకూరుకు గురుకులానికి చెందిన నాగకార్తీక్‌రెడ్డి ఎమ్పీసీలో 980, ఆదోని గురుకులానికి చెందిన వెన్నెల ఎమ్పీసీలో 980 మార్కులతో సిల్వర్‌ ర్యాంకులను సాధించి అవార్డులను కైవసం చేసుకున్నారు.

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌

పదవ తరగతిలో నంద్యాల సోషల్‌ వెల్ఫేర్‌ గర్ల్స్‌ హైస్కూల్‌కు చెందిన శశిరేఖ 587 మార్కులో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. అలాగే జూపాడుబంగ్లా బాలికల పాఠశాలకు చెందిన హారిక 584 మార్కులతో 4వ ర్యాంక్‌, యర్రగుంట్ల బాలుర హాస్టల్‌కు చెందిన వినయ్‌ 579 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. సీనియర్‌ ఇంటర్‌లో కోవెలకుంట్ల బాలికల కళాశాలకు చెందిన సంకీర్తన 970 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది.

ఫ ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలల్లో..

పదవ తరగతిలో పాణ్యం ట్రైబల్‌ ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇందు 570 మార్కులతో 4వ ర్యాంకు సాధించింది. ఆలూరు ట్రైబల్‌ వెల్ఫేర్‌కు చెందిన అంజలి 564 మార్కులు సాధించారు.

ఫ ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌

ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ శ్రీశైలం పాఠశాలకు రేవంతనాయక్‌ 590 మార్కులతో 1వ ర్యాంక్‌, రమావతఈశ్వర్‌నాయక్‌ 584 మార్కులతో 4వ ర్యాంక్‌, ఆళ్లగడ్డ ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలకు చెందిన మహేశనాయక్‌ 578 మార్కులతో 8వ ర్యాంక్‌ సాధించాడు. సీనియర్‌ ఇంటర్‌ల నెరవాడ కళాశాలకు చెందిన మనోజ్ఙబాయ్‌ 966 మార్కులు, పుల్లమ్మబాయ్‌ 966 మార్కులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నారు.

Updated Date - May 07 , 2025 | 11:18 PM