ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Civil Supplies Godowns : ఫిబ్రవరిలో ‘పప్పు’ ఉడకదు

ABN, Publish Date - Feb 05 , 2025 | 05:28 AM

పండుగ సీజన్‌ జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసిన సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌... ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే...

  • పౌర సరఫరాల గోదాముల్లో నిండుకున్న కందిపప్పు

  • సరఫరాదారులకు వైసీపీ హయాంలో 250 కోట్ల బకాయిలు

  • అవి చెల్లిస్తేనే సరఫరా... చేతులెత్తేసిన సివిల్‌ సప్లయిస్‌ అధికారులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది’ అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. పండుగ సీజన్‌ జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసిన సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌... ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది. కందిపప్పు కావాలని అడుగుతున్న కార్డుదారులకు ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనదారులు స్టాకు లేదని చెబుతున్నారు. కొంత కాలంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిరాణా దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.180 నుంచి రూ.200కు పైగా పలుకుతోంది. దీంతో కార్డుదారులందరూ ప్రభుత్వం రాయితీపై రూ.67కే అందిస్తానన్న కందిపప్పు కోసం ఆశగా ఎదురు చూశారు. గత నెలలో అరకొరగా అందిన కందిపప్పు ఈనెల పూర్తిగా లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.


నాటి వైసీపీ పాపాలే...

గత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ సరుకుల్లో ఒక్కొక్కటిగా కోత వేసి ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లూ బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసింది. అడపాదడపా కందిపప్పు... అదీ అరకొరగానే సరఫరా చేసింది. అలా కాంట్రాక్టర్లు అప్పుడప్పుడు సరఫరా చేసిన కందిపప్పుకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. వైసీపీ దిగిపోయేనాటికి ఆ మొత్తం సుమారు రూ.250 కోట్లకు పైగా చేరుకుందని అధికారులు చెపుతున్నారు. కూటమి ప్రభుత్వం కార్డుదారులందరికీ కందిపప్పు కూడా అందించాలని ఆదేశించింది. దీనికి టెండర్లు పిలవగా.. వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు దక్కించుకున్న వారే తాజా కాంట్రాక్టును దక్కించుకున్నారు. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కందిపప్పును సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఆ తర్వాత అడ్డం తిరిగారు. పాత బకాయిలు రూ.250 కోట్లకు పైగా ఉన్నాయని, అవి చెల్లిస్తేనే కందిపప్పు సరఫరా చేస్తామన్నారు. దీంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు నిస్సహాయంగా ఉండిపోయారు. సంక్రాంతి సందర్భంగా అందుబాటులో ఉన్న కందిపప్పును రేషన్‌ దుకాణాలకు పంపారు. కార్డుదారుల్లో సగానికి అటుఇటుగా మాత్రమే కందిపప్పు అందింది. ఇప్పుడు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. రాష్ట్రంలో 1,48,45,425 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వాలి. కానీ, కార్పొరేషన్‌ డేటా ప్రకారం... సోమవారం నాటికి 20 లక్షల కార్డుదారులకు సరిపడా కందిపప్పే రేషన్‌ డీలర్ల వద్ద ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 05:29 AM