ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు తర్తూరు రంగనాఽథుడి రథోత్సవం

ABN, Publish Date - Apr 12 , 2025 | 11:44 PM

మం డలంలోని తర్తూరు గ్రామంలోని లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి సాయికుమార్‌, కమిటీ చైర్మన నారాయణరెడ్డి తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీరంగనాథుడు

జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని తర్తూరు గ్రామంలోని లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి సాయికుమార్‌, కమిటీ చైర్మన నారాయణరెడ్డి తెలిపారు. రథోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

14న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

తర్తూరు జాతర సందర్భంగా ఈనెల 14న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 14న పాలబండ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గెలుపొందిన వృషభరాజుల యజమానులకు బహుమతులు వరసగా రూ. 40వేలు, రూ. 30వేలు, రూ. 20వేలు, రూ. 15వేలు, రూ. 10వేలు అందజేయనున్నట్లు చెప్పారు.

ఫ 15న సీనియర్‌ విభాగం పెద్దబండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గెలుపొందిన వృషభరాజులకు బహుమతులు వరసగా రూ. 70వేలు, రూ. 50వేలు, రూ. 30వేలు, రూ. 20వేలు, రూ.10వేలు అందజేయనున్నట్లు వారు తెలిపారు.

ఫ తర్తూరు జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో పోలీసుశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. శనివారం తర్తూరులో పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేశారు. జాతరలో ఎటువంటి ఘటనలు జరగుకుండా ఒకరు డీఎస్పీ, ఒకరు సీఐ, నలుగురు ఎస్‌ఐలు, 40 మంది పోలీసులను కేటాయించారు. ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వహించాలని వారికి సీఐ సుబ్రహ్మణ్యం సూచనలు, సలహాలను అందించారు.

.

Updated Date - Apr 12 , 2025 | 11:44 PM