Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై 200 పేజీల నివేదిక
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:55 AM
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు...
ప్రభుత్వానికి సమర్పించిన ఏకసభ్య కమిషన్
ఫ్రీహోల్డ్ భూములపై మరో 2 నెలలు నిషేధం
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మరణించగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన అన్ని కోణాల్లో విచారణ చేశారు. టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు భక్తులను కూడా విచారించారు. మూడు వాల్యూమ్స్‌గా నివేదికను సిద్ధం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎస్‌కు 200 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
Updated Date - Jul 12 , 2025 | 09:12 AM