Tirumala: తిరుమలలో భద్రత కట్టుదిట్టం
ABN, Publish Date - Apr 25 , 2025 | 05:03 AM
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. వాహనాల, లగేజీపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, ఆలయ పరిసరాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
కొండకు వెళ్లే ప్రతి వాహనం తనిఖీ
తిరుమల, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రం హెచ్చరికలతో జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలిపిరిలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని, వాటిలోని సామగ్రిని, అనుమానితులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల లగేజీలను స్కానింగ్ యంత్రాల్లో సూక్ష్మంగా పరిశీలన చేసిన అనంతరం తిరుమలకు పంపారు. తిరుమలకు వచ్చే వాహనాలను రెండో ఘాట్‌లోని లింక్‌రోడ్డుకు సమీపంలో ఆపి తనిఖీలు నిర్వహించారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు జల్లెడపట్టాయి. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్లమండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టిసారించారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.
తిరుమలలో ఆక్టోపస్ మాక్‌డ్రిల్
విశ్రాంతి భవనంలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తే భక్తులను ఎలా కాపాడాలి, ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టాలనే అంశంపై గురువారం సాయంత్రం ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ నిర్వహించింది. ముగ్గురు ఉద్రవాదులు లోపలికి ప్రవేశించగా దాదాపు 30మంది ఆక్టోపస్ సిబ్బంది లోపలకు వెళ్లి వారిని హతమార్చడం, ఉగ్ర దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం వంటి చర్యలను చాకచక్యంగా నిర్వహించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 05:03 AM