Godavari River: పశ్చిమ లంకలో మరో ఘోరం
ABN, Publish Date - May 28 , 2025 | 04:24 AM
ఆచంట మండలం అయోధ్యలంక శివారు గోదావరిలో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. వేసవి సెలవుల సందర్భంగా స్నానానికి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
స్నానానికి దిగిన ముగ్గురు బాలురు గల్లంతు
ఆచంట మండలం రావిలంక వద్ద ఘటన
ముమ్మరంగా గాలింపు
ఆచంట, మే 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద గోదావరిలో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. కోనసీమ జిల్లా గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన కేతా ప్రవీణ్(15), సానబోయిన సూర్యతేజ (12), నీతిపూడి పాల్‌కుమార్(15)తోపాటు మరో ఇద్దరు బాలురు మంగళవారం ఇక్కడ స్నానానికి దిగారు. వీరిలో ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్ గల్లంతు కాగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గన్నవరం, ఆచంట రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవీణ్ పదో తరగతి పరీక్షలు రాశాడు. సూర్యతేజ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాల్ కుమార్ యలమంచిలి మండలం పెదలంక వాసి. వేసవి సెలవులు కావడంతో బంధువైన సూర్యతేజ ఇంటికి వచ్చాడు. ముగ్గురి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
Read Latest National News and Telugu News
Updated Date - May 28 , 2025 | 04:24 AM