ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలోచింపజేసిన తరమెళ్లిపోతున్నది

ABN, Publish Date - Apr 24 , 2025 | 12:14 AM

కుటుంబ సంబంధాల విచ్ఛిన్నంపై ఆలోచనాత్మకంగా సాగిన ‘తరమెళ్లిపోతున్నది’ సామాజిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కుడా ఛైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లును సత్కరిస్తున్న పత్తి ఓబులయ్య, కళాకారులు.,

సాంతం ఆకట్టుకున్న సామాజిక ప్రదర్శన

టీజీవీ కళాక్షేత్రంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సంబంధాల విచ్ఛిన్నంపై ఆలోచనాత్మకంగా సాగిన ‘తరమెళ్లిపోతున్నది’ సామాజిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుంటూరుకు చెందిన కరణం సురేష్‌ మెమోరియల్‌ ఆర్ట్స్‌ సంస్థ కె.రామకృష్ణ దర్శకత్వంలో ఈ నాటకాన్ని ప్రదర్శించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం టీజీవీ కళా క్షేత్రంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ నాటకంలో రామకృష్ణ, డాక్టర్‌ శ్రీజ సాదినేని, కరణం సరిత, నల్లక శ్రీధర్‌, పోగతి నాగేశ్వరరావు నటించారు. సమకాలీన సమాజంలో అన్నదమ్ముల సంబంధాల్లోని సంక్షోభాలు ఇతివృత్తంగా సాగిన ఈ నాటకం ప్రేక్షకులను ఆలోచనలకు గురి చేసింది. కళాకారుల హావభావాలు, డైలాగులకు ప్రేక్షకులను ఆలరింపజేశాయి. అనంతరం కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం తరపున అధ్యక్షులు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

అభివృద్ధి దిశగా రాష్ట్రం

- కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. భావి తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు జన్మదిన వారోత్సవాలను పెద్దఎత్తున కళాకారులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఇల్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి కోసం మంత్రి టీజీ భరత కృషి చేస్తున్నారని అన్నారు.

ఫ నేడు సినిమా సంగీత విభావరి

చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో ఐదో రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. గజల్‌ గాయకుడు మహమ్మద్‌ మియా, గాయని సుధారాణి ఆధ్వర్యంలో ఈ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:14 AM