అహోబిలేశుడికి తిరుమంజనం
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:08 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీదేవి భూ దేవి సమేత లక్ష్మీనరసింహ స్వామికి నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామికి అభిషేకం చేస్తున్న అర్చకులు
ఆళ్లగడ్డ, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీదేవి భూ దేవి సమేత లక్ష్మీనరసింహ స్వామికి నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంభి వేణుగోపాలన స్వామి ఆధ్వర్యంలో ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నవకలశ పూర్వ పంచామృతాలతో విశేష జ్యేష్ఠాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:08 AM