ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూగజీవాల అరణ్య రోదన

ABN, Publish Date - May 11 , 2025 | 11:17 PM

మూగజీవాలకు తాగునీటి కోసం అరణ్య రోదన తప్పడం లేదు.

అవుకు మండలంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టి

· తాగునీటి కోసం తిప్పలు

· నిరుపయోగంగా నీటి తొట్లు

· నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

బనగానపల్లె, మే 11 (ఆంధ్రజ్యోతి): మూగజీవాలకు తాగునీటి కోసం అరణ్య రోదన తప్పడం లేదు. ప్రభుత్వం వేసవిలో జీవాల దాహార్తిని తీర్చడానికి గ్రామ పరిసరాల్లో నీటి తొట్లను నిర్మించడానికి సిద్ధమైంది. అయితే ఈ లక్ష్యం నీరుగారిపోతోంది. నిధులు మంజూ రు చేసినా ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.20వేలు వరకు ఖర్చు చేసింది. అయినా అవి నిరుపయో గంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్ర తినిధుల అలసత్వం వెరసి జీవాలను ఇక్కట్ల పాలు చేస్తోంది.

నియోజకవర్గంలో 60 నీటి తొట్లు

బనగానసపల్లె నియోజకవర్గంలో సుమారు 60 నీటి తొట్లను నిర్మించారు. ప్రతి రోజు నీటిని ఆ తొట్లలో నింపేందుకు అనువుగా వీటిని ఏ ర్పాటు చేయాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను పాటించలేదు. నీరు లేని చోట కూడా వీటిని నిర్మించారు. దీంతో ఇవి అలంకారప్రాయంగా మారాయి.

ఆనవాళ్లు లేకుండా పోయాయి

ప్రభుత్వం పెట్టిన నిధులు వృథా కాగా కొన్ని నీటితొట్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. కొన్నింటిని ధ్వంసం చేశారు. బనగానపల్లె మం డలంలో 18 నీటి తొట్లు నిర్మి చారు. కొలిమి గుండ్ల, అవుకు, కోవెలకుంట్ల, సంజామల మం డలాల్లో 42 నీటి తొట్లను పూర్తిచేశారు. వీటికి ఎనఆర్‌ఈజీఎస్‌ నిధులను ఖర్చుచేశారు. ఇప్ప టివరకు ఒక తొట్టిని కూడా నీటితో నింప లేదు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో చేపట్టిన పథ కం లక్ష్యం నెరవేరలేదు. కేవలం బిల్లుల కోస మే వీటిని నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - May 11 , 2025 | 11:17 PM