బలం.. బలగం కార్యకర్తలే
ABN, Publish Date - May 22 , 2025 | 11:53 PM
‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం కార్యకర్తలే.
వైసీపీ పాలనంతా అరాచకమే : మంత్రి బీసీ
నేడు సంక్షేమ పాలన : మంత్రి ఫరూక్
శ్రమించిన కార్యకర్తలకే పదవులు
కడప మహానాడుకు తరలిరండి
టీడీపీ శ్రేణులకు నేతల పిలుపు
నంద్యాలలో ఘనంగా మహానాడు
‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం కార్యకర్తలే. వారి కష్టమే లేకపోతే నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవాళ్లం కాదు. తాము ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే వాళ్లం కాదు. కార్యకర్తలను వెన్నంటి కాపాడటమే మా లక్ష్యం. వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాం..’
- రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనమైంది. అరాచక పాలన సాగించిన వైసీపీని ప్రజలే దూరం పెట్టారు. ఐదేళ్లలో నష్టపోయిన రాషా్ట్రన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ప్రభుత్వం దూసుకెళ్తోంది. కష్టకాలంలో శ్రమించిన కార్యకర్తలకే పదవులు దక్కుతాయి’
- రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్
నంద్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయిలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అని మంత్రులు బీసీ జనార్ధన రెడ్డి, ఎనఎండీ ఫరూక్‌లు కొనియాడారు. అలాంటి టీడీపీకి కార్యకర్తలు వెన్నెముక లాంటివారన్నారు. గురువారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులో జిల్లాస్థాయి మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులతో పాటు జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, గౌరు చరిత, గిత్తా జయసూర్య తదితర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ జనార్ధన రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో బటన నొక్కుడుతో మోసం చేయడం.. లక్షల కోట్లు అప్పు చేయడమే లక్ష్యంగా పాలన సాగిందని విమర్శించారు. ఎక్కడ చూసిన దౌర్జాన్యకాండ సృష్టించి బడుగు, బలహీన వర్గాలను నిలువు దోపిడి చేసిందన్నారు. కానీ టీడీపీ ఎప్పటికి బడుగు, బలహీన వర్గాలను అండగా పేదల అభివృద్ధి, సంక్షేమమే దిశగా కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నిత్యం పేదల కోసం పరితపిస్తారని కొనియాడారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు సూపర్-6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతోందన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, దీపం-2, తల్లికి వందనం తదితర వాటిపై క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు విస్రృత ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతిపక్షంలో శ్రమించిన ప్రతి కార్య కర్తకు పార్టీ గుర్తించి త్వరలోనే పదవులు కల్పిస్తుందన్నారు. ప్రధానంగా తమ వంతు బాధ్యతగా ఈ ఐదేళ్లలో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈనెలలో కడపలో నిర్వహించే మహానాడును జిల్లా నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చివరగా కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ మంతి ఏరాసు ప్రతాపరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన చైర్మన మౌలానా ముస్తాక్ అహ్మద్, వాల్మీకి కార్పోరేషన చైర్మన కొనతల రామకృష్ణ, తెలుగుగంగ, కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్లు సంజీవ కుమార్‌రెడ్డి, రామలింగారెడ్డి, సివిల్ సప్లైస్ సభ్యులు నరహారి విశ్వనాథరెడ్డి, మార్కెఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెల శ్రీరాములు, రామచంద్రరావు, వెంకటస్వామి, రామకృష్టారెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, మాజీ ఆర్‌ఐసీసీ చైర్మన ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్, టీడీపీ నాయకులు నాగేశ్వరావు, మహేశ్వరనాయుడు, రామాంజినాయక్, జమ్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పోలీసుల బందోబస్తు : జిల్లా స్థాయి మహానాడు నేపథ్యంలో డీఎస్పీ మంద జావలి అల్ఫోన్స నేతృత్వంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సీఐలు, ఎస్‌ఐలు, తదితర సిబ్బంది ఉదయం నుంచే టెక్కె మార్కెట్‌యార్డు ప్రాంగణం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్పీ పర్యవేక్షించారు.
Updated Date - May 22 , 2025 | 11:53 PM