భక్త జనసందోహంతో సాగిన శోభాయాత్ర
ABN, Publish Date - May 22 , 2025 | 11:50 PM
హనుమజ్జయంతిని పురష్కరించుకుని జై శ్రీరాం భక్తబృందం ఆధ్వర్యంలో గురువారం హనుమాన్ శోభయాత్రను భక్త జనసం దోహం నడుమ వైభవంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల, మే 22 (ఆంధ్రజ్యోతి): హనుమజ్జయంతిని పురష్కరించుకుని జై శ్రీరాం భక్తబృందం ఆధ్వర్యంలో గురువారం హనుమాన్ శోభయాత్రను భక్త జనసం దోహం నడుమ వైభవంగా నిర్వహించారు. పాత మార్కెట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి దర్గాబజార్, సుందరాచార్యుల వీధి, బొల్లవరం ఆంజనేయస్వామి గుడి, టీబీ రోడ్డు మీదుగా అభయ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర సాగింది. ఈ సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న వారికి మున్సిపల్ కమిషన్ మల్లికార్జున మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దశమందం బాబు, రాజశేఖర్, శివనాగిరెడ్డి, పుల్లారెడి ్డ, వెంకటేషు, ప్రశాంత్, సాయిమనోజ్, పాల్గొన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఎర్రగుంట్లలో గురువారం శోభాయాత్రను భక్త జనసందోహం నడుమ వైభవంగా నిర్వహించారు. నడివూ రు రామాలయం నుంచి ఆర్‌ఎస్ ఎస్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి విగ్రహ ఊరేగింపు జరిగింది. భక్తులు జైరాం అం టూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అలాగే తిప్పలూ రు తదితర చోట్ల హనుమత జయంత్యుత్సవాలు బారీగా సాగాయి.
మైదుకూరు రూరల్‌లో: మైదుకూరులో హనుమజ్జయంతి ఉత్సవ వేడుకలు మైదుకూ రులో వైభవంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీనగరంలోని అభయ ఆంఙజనేయస్వామి ఆలయం వద్ద, కేశలింగాయప ల్లెలో వేడుకలు నిర్వహిం చారు. కేశలింగా య పల్లె గ్రామంలో గ్రామస్థులందరూ హనుమా న్ శోభయాత్రలో ఆంజనేయస్వామి చిత్ర పటంతో గ్రామంలో ఊరేగింపు చేశారు. మధ్యాహ్నం అన్నదా నం ఘనంగా నిర్వహించారు.
బద్వేలుటౌనలో: అంజనీపుత్రుడు శ్రీరామ చంద్రుడికి పరమభక్తుడైన హనుమజ్జయం తి సందర్భంగా గురువారం పట్టణంలోని బైపాస్‌రోడ్డు వీరాంజనేయస్వామి ఆలయం నుంచి నాలుగు ప్రధాన రహదారుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు సిద్దవ టంరోడ్‌లో వెలసిఉన్న మహాలక్ష్మీ గోదాదేవి సహిత వేంకటేశ్వరస్వామి, అభ యాంజనేయస్వామి ఆలయంలో, భావనారా యణనగర్‌లోని వీరాంజనేయస్వామి ఆలయంలో, ఆంజనేయనగర్‌లోని అభయాంజనే యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీగోదాదేవి సహిత అభయాంజనేయస్వామి ఆలయంలో భక్తాదులకు ఆలయనిర్వాహకుడు వల్లెంకొండు వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా అన్నదానం నిర్వహించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.
.
Updated Date - May 22 , 2025 | 11:50 PM