రోడ్ల దుస్థితి మారదా !
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:15 PM
ప్రధాన రోడ్లపైన ఏర్పడ చిన్నపాటి గుంతలను సైతం పట్టించుకోకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
గుంతలమయమైన జమ్మలమడుగు రోడ్డు
ప్యాచింగ్‌లు కూడా చేయని ఆర్‌అండ్‌బీ అధికారులు
ప్రొద్దుటూరు, జూన 2 (ఆంధ్రజ్యోతి):ప్రధాన రోడ్లపైన ఏర్పడ చిన్నపాటి గుంతలను సైతం పట్టించుకోకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్ధితి నేటికి మార లేదు. దీంతో గుంతలతో దారుణంగా మారడంతో ప్రయాణికులు రోజు నరకయాతన అనుభవిస్తున్నారు. కానీ రోడ్లు భవనాల శాఖ అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ రోడ్ల దుస్ధితి పట్టడం లేదు. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డు గుంతలతో అధ్వా నంగా తయారైంది. గత రెండేళ్ల క్రితం పట్టణంలో బొల్లవరం నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు వరకు జమ్మలమడుగు ప్రధాన రోడ్డు మార్గాన తాగునీటి మెయిన పంపింగ్ లైను ఏర్పాటు చేశారు. పైపు లైను నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్గం అంతా తవ్వేశారు. టెస్టింగ్ పేరుతో చాలా కాలం తవ్విన పైపులైను గుంతలు పూడ్చలేదు. పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఆ తరువాత వాటిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పైప్‌లైన గోతులను ప్యాచలు వేసి పూడ్చారు కానీ ఆ పనులు సక్రమంగా జరగలేదు. దీంతో అప్పటి నుంచి ఆ రోడ్డు బొల్లవరం నుంచి మున్సిపల్ హైస్కూలు వరకు అనేక చోట్ల గుంతలు బయట పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహానాల్లో వెల్లే వారికి చాలా మంది ఈ గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యారు. . కార్లు బస్సులు ఆ గుంతల్లో దిగి దెబ్బ తింటున్నాయని వాపోతున్నారు. ఇక వర్షం వస్తే గుంతలు కనపడక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్‌అండ్‌బీ డీఈ ఏమన్నారంటే: వర్షాలు తగ్గుతూనే రోడ్లపై ఏర్పడని గుంతలను పూడ్చ డానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మీ నరసింహులు తెలిపారు. ప్రధాన రోడ్లపై గుంత విషయమై ‘ఆంధ్రజ్యోతి’ డీఈని వివరణ కోరగా పై విధంగా స్పందించారు.
Updated Date - Jun 02 , 2025 | 11:15 PM