నైపుణ్యంతోనే శిఖరాగ్రం
ABN, Publish Date - May 18 , 2025 | 01:24 AM
యువత కు వృత్తి విద్య కోర్సుల్లో నైపుణ్య శిక్షణను అందించి స్వయం ఉపాధి, ప్రభుత్వ, ప్రై వేట్ సంస్ధల్లో ఉద్యోగాలు సాధించడంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు కా వాల్సిన భరోసా ఇస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, భారతీనగర్: యువత కు వృత్తి విద్య కోర్సుల్లో నైపుణ్య శిక్షణను అందించి స్వయం ఉపాధి, ప్రభుత్వ, ప్రై వేట్ సంస్ధల్లో ఉద్యోగాలు సాధించడంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు కా వాల్సిన భరోసా ఇస్తున్నాయి. స్కిల్ డెవల్‌పమెంట్ రంగప్రవేశం చేయటంతో ఐటీ ఐ మళ్లీ పునరుజ్జీవం పోసుకోవటంతో పా టు ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతోంది. ఐటీఐలో చేరిన విద్యార్థులకు క మ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. మెలకువలపై పట్టుసాధించడం, కోర్సులు పూర్తికాగానే మెండుగా ఉపాధి అవకాశా లు లభించడంతో స్వల్పకాలిక వ్యవధిలో నే యువత జీవితాల్లో స్థిరపడి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఇటీవల టెన్త్ ఫలితాలు రావడంతో టెక్నికల్ కోర్సులు చదువుకొనే విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నా రు. టెన్త్ విద్యార్హతతో రెండేళ్ల కోర్సులు చే సేందుకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఒక ప్ర భుత్వ ఐటీఐ కళాశాల, 10 ప్రైవేట్ కళాశాలు అందుబాటులో ఉన్నాయి 2025-25 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశించడానికి 1644 సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.
ఐటీఐలో ట్రేడులు వివరాలు
ఎలక్ర్టానిక్ మెకానిక్, డ్రాప్ట్‌మెన్ (సివి ల్), ఎలక్ర్టీషియన్, మెకానిక్ (మోటర్ వెహికల్) మిషనిస్ట్, టర్నర్, ఫిట్టర్, వైర్‌మెట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ టెక్నీషియన్ వంటి రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టెన్త్ విద్యార్హత తో ఏడాది కోర్సులు చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానికల్ డీజిల్ వంటి కోర్సులు, 8వ తరగతి విద్యార్హతతో సూయింగ్ టె క్నాలజీ, వెల్డర్ వంటి ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐలో ప్రత్యేక శిక్షణ ట్రేడ్‌లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ల్యాబ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పెయింటింగ్, అండ్ టెస్టింగ్ ల్యాబ్, ఏఆర్‌అండ్ వీఆర్ ల్యాబ్‌లు ఏడాది నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు వి ద్యార్థులకు డ్రైవింగ్ శిక్షణలో మెళుకువలు నేర్పడంతో పాటు నేరుగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు మినీ వాహనం కూడా ఉంది.
స్కిల్ డెవల్‌పమెంట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కిల్ డెవల్‌పమెంట్ ద్వారా విద్యార్థులకు 3 నె లల శిక్షణ అందించిన వెంటనే ఉపాధి అ వకాశాలు దొరుకుతున్నాయి. ఐదేళ్లలో ఐ టీఐలో ఎలక్ట్రికల్, ఫిటర్, టర్నర్, మెకానికల్ డీజిల్ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సం స్థల్లో 35శాతం ఉద్యోగాలు సాధించారు.
నేరుగా పాలిటెక్నిక్ సెకెండియర్‌లోకి..
ఐటీఐలో రెండేళ్ల కోర్సును పూర్తిచేసి ఉ త్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో అదే (ఐటీఐలో ఎలక్ర్టికల్, మెకానికల్ వంటి తదితర కోర్సులో పూర్తి చేసిన) కోర్సుల్లో రెండో సంవత్సరంలోకి ప్రవేశించి విద్యను అభ్యసించవచ్చు.
ఉద్యోగ, అప్రెంటిస్ షిప్
ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, అప్రెంటి్‌సషి్‌పకు ప్రాధాన్యత క ల్పిస్తున్నాయి. ఏటా జిల్లాలో ఐటీఐ పూర్తిచేసి అర్హులైన విద్యార్థులకు వివిధ రం గాల్లో ఉద్యోగ, అప్రెంటిస్ షిప్ అవకాశా లు కల్పిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఒక ప్రభు త్వ ఐటీఐ, 10 ప్రైవేట్ ఐటీఐ కళాశాలు న్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు, ప్రైవేట్ ఐ టీఐ కళాశాల్లో వివిధ ట్రేడ్లలో 944 సీట్లున్నాయి. ఈ విద్యాసంవత్సరం జిల్లాలోని అన్ని కళాశాలల్లో 1624 సీట్లు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. అభ్యర్ధులు ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈనెల 24లోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.
కమ్యూనికేషన్‌స్కిల్స్‌లో ప్రత్యేకశిక్షణ
ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కనకారావు
ఐటీఐలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం అవసరమైన మెలకువలపై పట్టుసాధించడంతో పాటు కోర్సులు పూర్తికాగానే ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం. ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిటర్, టర్నర్, మెకానికల్ డీజిల్ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కాబట్టి ఐటీఐలో వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆసక్తికలిగినవారంతా దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
Updated Date - May 18 , 2025 | 01:24 AM