కొలువుదీరిన పీర్లు
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:53 PM
మండల కేంద్రంలోని చిన్నమకానం వీధిలో ప్రధాన పీర్లను శుక్రవారం కొలువుదీరింపచేశారు.
చాగలమర్రి, జూన 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని చిన్నమకానం వీధిలో ప్రధాన పీర్లను శుక్రవారం కొలువుదీరింపచేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు చేశారు. కోటగడ్డ వీధిలో వెలసిన హుర్‌సయ్యద్ పీరు ఉత్సవాన్ని 2న నిర్వహిస్తారు. 3న పోలీసు స్టేషన సమీపంలోని హసన, హుసేన పీర్లు జరుగుతాయి. 4న గుర్రంపై అలీఅక్బర్ పీరును కొలువుదీరింప చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5న ప్రధాన పీరైన లాల్‌స్వామిని దివిటిల మధ్య రాత్రిసరిగెత్తు నిర్వహిస్తారు. 6న హిందూ, ముస్లింలు ఐకమత్యంతో గంధం చల్లుకుంటూ లాల్‌స్వామిని ఊరేగింపు చేస్తారు. 7న జరిగే జియారతతో మొహర్రం ముగుస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మొహర్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
Updated Date - Jun 27 , 2025 | 11:53 PM