చివరి ఆయ‘కటకట’
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:42 PM
సాగునీటి కాలువలపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు కాక పోయినా మరమ్మతులకు నోచుకోకపోవటంతో కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
శిథిలావస్థలో డిస్ర్టిబ్యూటరీలు
మరమ్మతులకు నోచుకోని వైనం
గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
అత్యవసర మరమ్మతులపై కూటమి ప్రభుత్వం దృష్టి
సాగునీటి కాలువలపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు కాక పోయినా మరమ్మతులకు నోచుకోకపోవటంతో కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ప్రధాన కాలువపై ఉన్న శ్రద్ధ డిస్ర్టిబ్యూటరీ కాలువలపై ప్రభుత్వాలు పెట్టకపోవటంతో అవి కాస్త అధ్వానంగా మా రాయి. అరకొర నిధులతో నీటి విడుదలకు ముందు జంగిల్ క్లీనింగ్ వంటి పనులుచేసి చేతులు దులుపు కుంటున్నారు. దీంతో కాలువలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందటం గగనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం కాలువల మరమ్మతులపై దృష్టి సారించి పలు పనులకు నిధులు మంజూరు చేసింది.
ఎమ్మిగనూరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలకు ప్రధాన కాలువపై ఉన్న శ్రద్ధ డిస్ర్టిబ్యూటరీ కాలువలపై లేకపోవడంతో కాలువలు కాస్త అధ్వానంగా మారాయి. ఎమ్మిగ నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో పంట కాలువలు శిథిలమ య్యాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందక ఆ ప్రాంతాలు బీళ్లుగా మారు తున్నాయి. దీంతో రైతులు వర్షాధార రైతులు వర్షాధార పంటలను సాగుచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఎల్లెల్సీ నీటితో మూడు పంటలు పండించిన రైతులు ఎగువన కర్ణాటక జలచౌర్యం, పంట కాలువలు పాడైపోవటంతో నేడు ఒక పంటను కూడా సాగుచేసుకునే స్థితిలో లేడు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంటలు అధ్వానంగా మారాయి.
ఆరు మేజరు, 12 మైనర్ డిస్ర్టీబ్యూటరీలు:
ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎల్లెల్సీ ప్రధాన కాలువ కింద కౌతాళం, మాధవరం, సూగూరు, గంగవరం , సీకే మేజర్, ఎంఎస్సీ డిస్ర్లీబ్యూటరీలు ఉన్నాయి. అలాగే 74, 75ఎ, 75బి, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 86 డిస్ర్టీబ్యూటరీలు ఉన్నాయి.
ఈ కాలువల ద్వారా ఆయా ప్రాంతాల్లోని భూములకు రబీ, ఖరీఫ్‌లో ఎల్ల్లెల్సీ ప్రధాన కాలువ నుంచి సాగునీరు అందాల్సి ఉంది. కర్ణాటకలో జలచౌర్యం వల్ల మనకు రావాల్సిన సాగునీరు రావటం లేదు. పంట కాలువలు మరమ్మతులకు నోచుకోక ఆనవాళ్లు కోల్పోతు న్నాయి. కాలువలకు లైనింగ్ లేకపోవటంతో విడుదలైన సాగునీరు కాలువల నుంచి ముందుకు సాగటం లేదు.
ఆనవాళ్లు కోల్పోతున్నాయి..
ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని పంట కాలువలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఎమ్మిగనూరు ప్రాంతం లోని డీపీ 79, 80, 81, 82, 86, ఎంఎస్‌పీ, ఎంఎల్‌ఎస్‌పీ కాలువలు అధ్వాన స్థితికి చేరుకు న్నాయి. గత ప్రభుత్వాలు కొంతమేర అక్కడ సీసీ లైనింగ్, జంగిల్ క్లీనింగ్ పనులు చేపట్టా యి. అనంతరం పట్టించుకోకపోవటంతో కాలువలో కంపచెట్లు పెరిగి అవి కనిపించటం లేదు. డీపీ 81 కాలువ కుచించుకుపోయి మట్టి కాలువలుగా మారింది. కాలువలకు ఏర్పాటుచేసిన డ్రాప్‌లు కూడా ధ్వంసమయ్యాయి. ఎంఎస్‌పీ రిజర్వాయర్ నుంచి దిగువకు వెళ్లే కాలువ ఎర్రకోట వరకు బాగానే ఉన్నా దిగువన కాలువకు ఇరువైపుల సీసీ లైనింగ్ దెబ్బతింది. పార్లపల్లిదగ్గర పైప్‌లైన వేసినా అదికూడా రంధ్రం పడింది. అక్కడక్కడ ఏర్పా టుచేసిన సిమెంట్ తొట్లు పగిలిపోయి సాగునీరు వృథాగా పోతున్నాయి. కాలువ గట్టు దెబ్బతింది. గతంలో సీసీ లైనింగ్ చేయటంలో నాణ్యత పాటించటకపోవటంతో కట్టలు ధ్వంసమయ్యాయి. పొణకలదిన్నె, డీపీ 86, ఎంఎల్‌ఎస్పీ కాలువలు సీసీ లైనింగ్ లేకుండా పోయింది. నందవరం మండలంలో ముగతి గ్రామం మీదుగా వెళ్లే 6ఎల్, 8ఎల్ కాలువలు మరమ్మతులకు నోచుకోక పోవటంతో ముళ్లకంపలు పెరిగిపోయి దిగువకు నీరు వెళ్లటం కష్టంగా మారింది.
ఫ మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలంలోని రౌడూరు ఆయకట్టు కాలువ, మండలకేంద్రమైన కౌతాళంకు వచ్చే కాలువ, ఉప్పరహాల్ పంటకాలువలకు మరమ్మతులు లేకపోవటం, సాగునీరు రాకపోవటంతో కాలువల ఆనవాళ్లు కనిపించటం లేదు. కోసిగి మండలంలోని దుద్ది గ్రామసమీపంలో ఉన్న ఎల్లెల్సీ పంటకాలువ సీసీలైనింగ్ ధ్వంసమైంది. పెద్దకడుబూరు మండలంలోని గంగవరం మేజర్ కాలువలో ముళ్ల కంపలు ఏపుగా పెరిగాయి. సూగూరు మేజర్ కాలువ సైతం గట్లు దెబ్బతిన్నాయి. మంత్రాలయం మండలం వగరూరు నుంచి సూగూరు, బూదూరు మీదుగా ఉన్న, సింగరాజన హళ్లి, మాలపల్లి మీదుగా ప్రవహించే పంట కాలువలు ధ్వంసమై పూడిక పేరుకుపోయింది.
రూ.2కోట్లు మంజూరు
పంట కాలువల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కాలువల మరమ్మతులకు అధికారులు రూ.4కోట్లు ప్రతిపాదనలు పెట్టగా అత్యవసర మరమ్మతుల కోసం రూ.2కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రధాన కాలువ 299 కి.మీ నుంచి 305కి.మీ వరకు పలు పనులు అధికారులు ప్రారంభించారు. వీటిలో కొన్ని పూర్తి కాగా మరి కొన్ని పనులు జరుగుతున్నాయి.
సీసీ లైనింగ్ లేకపోవటంతో..
పంట కాలువకు సీసీ లైనింగ్ లేకపోవటంతో సాగునీరు దిగువకు రావటం కష్టంగా ఉంది. ఎల్లెల్సీ కాలువ దగ్గర ఈ రోజు వదిలితే రేపు కాని రావు. కాలువలో పిచ్చి మెక్కలు, గడ్డి, పెరిగిపోతున్నాయి.
ఫ తిమ్మన్న, రైతు, గువ్వలదొడ్డి, ఎమ్మిగనూరు
కంప చెట్లు పెరిగిపోయి..
మాదవరం మేజర్ కాలువ కింద పొలాలున్నాయి. కాలువ మరమ్మతులకు నోచుకోకపోవటంతో మట్టి, కంపచెట్లు పెరిగిపోయాయి. మా పొలాల వరకు నీరు రావటం లేదు.
ఫ దేవన్న రాఘవేంద్ర, రైతు, దొడ్డి బెళగల్, కోసిగి మండలం
రూ. 4కోట్లకు ప్రతిపాదనలు పంపగా..
ఎమ్మిగనూరు సబ్ డివిజన పరిదిలోని డిస్ర్టిబ్యూటరీ కాలువల మరమ్మతుల కోసం రూ. 4కోట్లుతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.2కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల తో ప్రధాన కాలువలో కొన్ని చోట్ల జంగిల్ క్లీనింగ్‌తో పాటు డిస్ర్టిబ్యూటరీల దగ్గర సిమెంట్ పనుల చేపట్టాం.
ఫ విద్యాసాగర్, డీఈ, ఎల్లెల్సీ సబ్‌డివిజన, ఎమ్మిగనూరు
Updated Date - Jul 13 , 2025 | 11:42 PM