ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా చెన్నకేశవుడి తిరు రథోత్సవం

ABN, Publish Date - May 16 , 2025 | 11:51 PM

పట్టణంలో వెలసిన భూలక్ష్మీ సమేత చెన్నకే శవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం తిరు రథోత్సవం కార్యక్రమాన్ని వైభవం గా నిర్వహించారు.

అవుకు, మే 16 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో వెలసిన భూలక్ష్మీ సమేత చెన్నకే శవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం తిరు రథోత్సవం కార్యక్రమాన్ని వైభవం గా నిర్వహించారు. మండపం వీధిలో రాత్రి నిద్రించిన ఉత్సవమూర్తులకు ఉదయం అర్చ కులు పూజలు చేశారు. సాయంత్రం స్వాము ల వారిని పట్టువస్ర్తాలు, పూలమాలలతో అలంకరించి పూజలు చేసి తిరు రథోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెక్కభజన కోలాటలు, భక్తుల ఆనందోత్సవాల మధ్య స్వామి వారి రథం అమ్మవారిశాల వీధి, రాజవీధి మీదుగా తేరు వీధికి చేర్చారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం నిర్వహించే తీర్థవాది, ధ్వజారోహణం, వసంతోత్సవం, కార్యక్రమాలతో బ్రహ్మోత్సవా లు ముగియనున్నాయి. సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇనచార్జి ఈవో వీరయ్య, టీడీపీ అవుకు మండల అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, టీడీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్‌, టీడీపీ నాయకులు బత్తిన మద్దిలేటిగౌడు, తిక్కన్న, దంతెల రమణ, అరుణ్‌ కుమార్‌నాయక్‌, వెంకటరాముడునాయక్‌, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

హోరాహోరీగా సాగిన బండలాగుడు పోటీలు

పట్టణంలో భూలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన బండలా గుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను టీడీపీ మండల అధ్యక్షుడు ఐ.ఉగ్రసేనారెడ్డి, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమ ణనా యక్‌, బత్తిన మద్దిలేటిగౌడు కలిసి ప్రారంభిం చారు. పోటీల్లో ఏడుజతల వృషభాలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి రూ. లక్ష నంద్యాల జిల్లా డోన మండలం ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన వృషభాలు గెలుపొందాయి. రెండో బహుమతి రూ. 80వేలు అనంతపురం జిల్లా గార్లదిన్నె గ్రామానికి చెందిన రామాంజనే యులు వృషభాలు, మూడవ బహుమతి రూ.60వేలు నంద్యాల జిల్లా గుంపరమనుదిన్నె గ్రామానికి చెందిన కుందురు రాంభూపాల్‌రెడ్డి వృషభా లు, నాలుగవ బహుమతి రూ. 40వేలు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రమేష్‌బాబు వృషభాలు, అయిదవ బహుమతి రూ. 20వేలు నంద్యాల జిల్లా హుశేనాపురం గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు, ఆరవ బహుమతి రూ. 10వేలు కడప జల్లా చౌటపల్లెకు చెందిన చంద్ర ఓబుళరెడ్డి వృషభాలు గెలుచుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిక్కన్న, దంతెల రమణ, అరుణ్‌కుమార్‌నాయక్‌, వెంకటరాముడునాయక్‌, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:51 PM