ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళల రక్షణే ధ్యేయం

ABN, Publish Date - Aug 01 , 2025 | 11:28 PM

మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని మహిళా పోలీస్‌ స్టేషన డీఎస్పీ ఎం.ఉపేంద్ర బాబు వెల్లడించారు.

జిల్లా ఎస్పీని కలిసిన నూతన డీఎస్పీ ఉపేంద్రబాబు

మహిళా పోలీస్‌ స్టేషన డీఎస్పీ ఉపేంద్రబాబు

కర్నూలు క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని మహిళా పోలీస్‌ స్టేషన డీఎస్పీ ఎం.ఉపేంద్ర బాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన కర్నూలు నగరంలోని మహిళా పోలీస్‌ స్టేషన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు డీఎస్పీగా పని చేస్తున్న ఈయన ఇటీవల జరిగిన బదిలీల్లో కర్నూలుకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న డీఎస్పీ కె.శ్రీనివాసాచారి గుంతకల్లు రైల్వేకి బదిలీ అయ్యారు. డీఎస్పీ ఉపేంద్రబాబు స్వస్థలం అనంతపురం పట్టణం. 1995 బ్యాచకు చెందిన ఈయన ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పాణ్యం, నంద్యాల ట్రాఫిక్‌, దొర్నిపాడు, ప్యాపిలి, ఉలిందకొండ, హోళగుంద పోలీస్‌ స్టేషన్లలో పని చేశారు. సీఐగా అనంతపురం పీటీసీకి, కర్నూలు వనటౌనలో, సీఐడీలో 7 సంవత్సరాలు, సీసీఎస్‌లో 4 సంవత్సరాలు పని చేశారు. అలాగే డీఎస్పీగా అనకాపల్లిలో, ఎమ్మిగనూరులో పని చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి అరికట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. శక్తియాప్‌, శక్తి వాట్సాప్‌ గురించి మహిళా చట్టాలపై కళాశాలలో, పాఠశాలల్లో మహిళల భద్రతే లక్ష్యంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 11:28 PM