ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల సంక్షేమమే లక్ష్యం

ABN, Publish Date - Jun 21 , 2025 | 12:06 AM

పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని డోన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

కార్మికుల దీక్షను విరమింపజేస్తున్న నాయకులు

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

కార్మికులు దీక్ష విరమణ

బేతంచెర్ల, జూన 20 (ఆంధ్రజ్యోతి): పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని డోన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. సిమెంటు ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న 13 మంది కార్మికులను యాజమాన్యం విధుల్లోకి తీసుకోకపోవడంతో 20 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికుల పక్షాన యాజమాన్యంతో కోట్ల సుజాతమ్మ చర్చించా రు. విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో శుక్రవారం కార్మికులకు నిమ్మ రసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ మూతపడిన ఫ్యా క్టరీని పునరుద్ధరించాలన్నదే తమ లక్ష్యమని, కా ర్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని యాజ మాన్యంతో చర్చించామన్నారు. సిమెంటు ఫ్యాక్టరీని శనివారం నుంచి పునఃప్రారంభిస్తామని యాజ మాన్యం తెలిపారన్నారు. కార్మి కులను విధుల్లోకి తీసుకుని వా రికి రావాల్సిన జీతభత్యాలు కూ డా చెల్లిస్తామని సిమెంటు ఫ్యా క్టరీ వైస్‌ ప్రెసిడెంటు శ్రీనివాస రావు, సీఈవో శేషారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కోట్ల సుజాతమ్మ కృషితోనే తమకు న్యాయం జరిగిందని కార్మికులు హర్షం వ్యక్తం చేశా రు. రుణపడి ఉంటామన్నా రు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, తిరుమలేష్‌ చౌదరి, కేవీ సుబ్బారెడ్డి, వర్దన రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు మోజెస్‌, రామసుబ్బ య్య, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:06 AM