ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నిక ఏకగ్రీవం

ABN, Publish Date - May 20 , 2025 | 12:00 AM

మున్సిపల్‌ చైర్‌పర్సనగా వైసీపీకి చెందిన 42వ వార్డు కౌన్సిలర్‌ సీహెచ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నియామక పత్రాన్ని అందుకుంటున్న సీహెచ లోకేశ్వరి

ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సనగా సీహెచ లోకేశ్వరి

ప్రమాణ స్వీకారం చేయించిన కమిషనర్‌

ఆదోని, మే 19(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ చైర్‌పర్సనగా వైసీపీకి చెందిన 42వ వార్డు కౌన్సిలర్‌ సీహెచ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో మున్సిపల్‌ చైర్‌ పర్సన ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అబ్జర్వర్‌ కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ హాజరయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ అధ్యక్షతన ప్రక్రియ సాగింది. ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సన ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన హాజరయ్యారు. కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్‌ సీహెచ లోకేశ్వరి చెర్‌పర్సన పదవికి ఒక్కరే నామినేషన దాఖలు చేశారు. 36వ వార్డు కౌన్సిలర్‌ సందీప్‌ రెడ్డి ఆమె పేరును ప్రతిపాదించగా.. 40వ వార్డు కౌన్సిలర్‌ ఫయాజ్‌ అహ్మద్‌ చైర్‌ పర్సనగా బలపరిచారు. సీహెచ లోకేశ్వరి ఒక్కరే నామినేషన వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సనగా సీహెచ లోకేశ్వరిని అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికకు టీడీపీ ఒకటో వార్డు కౌన్సిలర్‌ పార్వతితో కలిపి 36 మంది వార్డు కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడుగా ఎమ్మెల్సీ మధుసూదన హాజరయ్యారు. మొత్తం 42 మంది కౌన్సిలర్లు ఉండగా ఐదుగురు హాజరు కాలేదు. ఒకటో వార్డు టీడీపీ కౌన్సిలర్‌ పార్వతి హాజరయ్యారు. అయితే వైసీపీకి చెందిన 36 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ మధుసూదన లోకేశ్వరి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన ఎన్నికకు కోరం కన్నా ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండడంతో చైర్‌పర్సన నియామక ప్రక్రియ ముగిసింది. అనంతరం చైర్‌పర్సనకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఎన్నికల అబ్జర్వర్‌ జాయింట్‌ కలెక్టర్‌ నవ్య చేతుల మీదుగా సీహెచ లోకేశ్వరికి అందజేశారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సనగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన లోకేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - May 20 , 2025 | 12:00 AM