ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సుంకేసుల జలశోభ

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:58 AM

తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతోంది. సుంకేసులు బ్యారేజీ జల అందాలు సంతరించుకుంది.

జలకళతో తుంగభద్ర జలాశయం

క్రస్ట్‌గేట్లు దాటి తుంగభద్ర పరుగులు

బ్యారేజీకి 61 వేల క్యూసెక్కుల వరద

21 గేట్లెత్తి శ్రీశైలానికి 63,264 క్యూసెక్కులు విడుదల

జల అందాలు వీక్షించి పరవశిస్తున్న ప్రకృతి ప్రేమికులు

కర్నూలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతోంది. సుంకేసులు బ్యారేజీ జల అందాలు సంతరించుకుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో సుంకేసుల వద్ద సందడి నెలకొంది. తుంగభద్ర అందాలును వీక్షించేందుకుందుకు నగర వాసులు పెద్ద ఎత్తున రైల్వే బిడ్జి, నేషనల్‌ హైవే, సంకల్‌బాగ్‌ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఎగువన ఆర్డీఎస్‌ ఆనకట్టపై వరద పోటెత్తింది. మంత్రాలయం రాఘవేంద్రుడి సన్నిధానం చెంత పరుగులు పెడుతోంది. కన్నడ రాజ్యంలో తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల దాటి 61,145 క్యూసెక్కుల వరద కర్నూలు వైపు పరుగులు పెడుతోంది.

కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త జలాశయం తుంగభద్ర డ్యాం ముందస్తు వరదలతో పదేళ్ల రికార్డు సొంతం చేసుకుంది. గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. గతేడాది 19వ గేటు కొట్టుకుపోవడం, గేట్లు పటుత్వం తగ్గిపోవడంతో డ్యాం సేఫ్టీ నిపుణుల సూచన మేరకు 80 టీఎంసీలే నిల్వ చేయాలని టీబీపీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మంగళవారం 51,500 క్యూసెక్కులు వరద కొనసాగుతుండగా, 75.93 టీఎంసీలు నిల్వ చేసి 20 క్రస్ట్‌గేట్లు ఎత్తి 61,145 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళిగనూరు చెంత తెలుగింట అడుగు పెడుతుంది. ఆర్డీఎస్‌ ఆనకట్ట వరద పరవళ్లతో పోటెత్తింది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి క్షేత్రం దాటి నందవరం, సి. బెళగల్‌ మండలాలు మీదుగా సుంకేసుల బ్యారేజీ చేరుకుంది. బ్యారేజీకి 61 వేల క్యూసెక్కులు ఇనఫ్లో కొనసాగుతోంది. సామర్థ్యం 1.20 టీఎంసీలే. దీంతో 21 గేట్లెత్తి 63,264 క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరం దాటి సంగమేశ్వరం చెంత తుంగభద్రమ్మ కృష్ణమ్మ జలఒడిలో సంగమం అవుతోంది. సుంకేసుల బ్యారేజీ వద్ద పెద్దగా నీటి నిల్వ లేకపోయినా.. విశాలంగా వరద ప్రవహిస్తుండడంతో ఆ అందాలను వీక్షించేందుకు ఇటువైపు కర్నూలు జిల్లా, అటు వైపు జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన పలు గ్రామాల ప్రకృతి ప్రేమికులు తరలి రావడంతో సందడి నెలకొంది.

ఫ 14న కేసీ కెనాల్‌కు సాగునీరు:

తుంగభద్ర వరదతో సుంకేసుల పోటెత్తినా కేసీ కాలువకు సాగునీరు ఇవ్వడం లేదు. అయితే.. కర్నూలు జిల్లాలో 3,763 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ నెల 14న కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం కలెక్టర్‌ పి. రంజితబాషా అధ్యక్షతన జరిగిన ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా కేసీ కెనాల్‌ ఇంజనీర్లు సన్నహాలు చేస్తున్నారు. కాలువ గేట్లు మరమ్మతులు చేస్తున్నారు. నగరం పరిధిలో కేసీ దుర్గంధం వెదజల్లుతోంది. నీరు విడుదల చేస్తే మురుగు కొట్టుకుపోయి దుర్గంధం నుంచి ఉపశమనం కలుగుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు.

ఫ రేపు ఎల్లెల్సీ సాగునీరు:

జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో 35 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, ఈ నెల 10 నుంచి తుంగభద్ర డ్యాం నుంచి కాలువకు సాగునీరు విడుదల చేయాలని ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు టీబీపీ బోర్డుకు జిల్లా ఇరిగేషన ఇంజనీర్లు ఇండెంట్‌ ఇచ్చారు. టీబీ డ్యాం నుంచి ఏపీ సరిహద్దుకు చేరడానికి ఐదారు రోజులు పడుతుందని అంచనా. 18వ తేది నుంచి ప్రధాన కాలువ నుంచి పంట కాలువలకు సాగునీరు ఇచ్చేందుకు ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఆయకట్టు రైతులు వరి, మిరప, పత్తి.. వంటి పంటలు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:58 AM