Amaravati Tenders: అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాల టెండర్లు ఖరారు
ABN, Publish Date - Apr 18 , 2025 | 04:30 AM
అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థకు, హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎన్‌సీసీ సంస్థకు అప్పగించారు సీఆర్‌డీఏ నిర్వహించిన టెండర్ల ప్రకారం, రూ.617 కోట్లు, రూ.786 కోట్లతో ఈ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి
అసెంబ్లీ భవనం ఎల్ అండ్ టీకి, హైకోర్టు భవనం ఎన్‌సీసీ సంస్థకు ఖరారు
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలు ఇక ప్రారంభం కానున్నాయి. ఏపీసీఆర్‌డీఏ నిర్వహించిన టెండర్లలో ఎల్1గా నిలిచిన సంస్థలకు టెండర్లను ఖరారుచేస్తూ మున్సిపల్‌శాఖ ఆదేశాలిచ్చింది. ఎల్1 టెండర్ దారులను ఖరారుచేసే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు టెండర్లు ఖరారు చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.590 కోట్ల అంచనా విలువకు గాను 4.48 ఎక్సె్‌సతో ఎల్ అండ్ టీ సంస్థకు రూ. 617 కోట్లకు పనులు అప్పగించారు. అదేవిధంగా హైకోర్టు భవన నిర్మాణానికి రూ.750 కోట్ల అంచనా విలువకు గాను 4.52 శాతం ఎక్సె్‌సతో రూ.786 కోట్లకు పనులను ఎన్‌సీసీ సంస్థకు అప్పగిస్తున్నట్లు మున్సిపల్‌శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Updated Date - Apr 18 , 2025 | 04:30 AM