ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rice Card Applications: రైస్‌ కార్డులో మ్యాపింగ్‌ మంటలు

ABN, Publish Date - May 22 , 2025 | 04:53 AM

కొత్త రైస్‌ కార్డు దరఖాస్తు ప్రక్రియ హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ కారణంగా సాంకేతిక సమస్యలతో నిలిచిపోతోంది. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందనీ, అవసరమైతే గడువులు పొడిగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో తప్పులతడకగా

హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌

దాని ఆధారంగా దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ

దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు

మ్యారేజీ సర్టిఫికెట్‌ అవసరం లేదన్న మంత్రి

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో ఇబ్బంది

మార్పులు చేర్పులకే ఎక్కువగా దరఖాస్తులు

కొత్త కార్డుల కోసం వచ్చినవి 59,959

సభ్యుల చేరికల కోసం 4 లక్షలకు పైగా..

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొత్త రైస్‌ కార్డు దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ రసాభాసగా మారుతోంది. హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ కారణంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఇటు అర్జీదారులకు, అటు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ముందుచూపు లేకుండా తప్పులతడకగా చేసిన ఈ మ్యాపింగ్‌ ఆధారంగా ప్రస్తుతం రైస్‌ కార్డు దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తుండటం సమస్యగా మారింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రైస్‌ కార్డు మంజూరు చేయడంతో పాటు ఉన్న కార్డుల

విభజన, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులు, అనర్హుల కార్డులు సరెండర్‌ చేసేందుకు ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అర్జీదారులు క్యూ కడుతున్నారు. వీరిలో కొత్త కార్డుల కోసం వచ్చేవారి కంటే ఉన్న కార్డులో సభ్యులను చేర్చడం లేదా తొలగించడం కోసం వస్తున్న దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఇలాంటి చిన్నచిన్న సవరణల కోసం వచ్చిన దరఖాస్తులే 80శాతానికి పైగా ఉన్నాయి.


పిల్లల పేర్లు చేర్చడానికి తంటాలు

ఐదు, పదేళ్ల క్రితమే వివాహమైన దంపతులు ఇప్పుడు తమ రైస్‌ కార్డులో పిల్లలను చేర్పించడానికి హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ కారణంగా నానా తంటాలు పడాల్సి వస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఒకేచోట నివసిస్తున్నట్లుగా మ్యాపింగ్‌ జరగకపోతే వారి దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదు. ఉద్యోగాల రీత్యా, ఇతరత్రా కారణాలతో కొందరు భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో భార్య, పిల్లలు ఒకచోట.. భర్త పేరు వేరే ప్రాంతంలో మ్యాపింగ్‌ అయ్యాయి. ఇప్పుడు వారు తమ పిల్లలను రైస్‌ కార్డులో చేర్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే సమయంలో నివాసం దగ్గర ఎర్రర్‌ చూపిస్తోంది. భర్త పేరు లేకుండా భార్య, పిల్లలు విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం సచివాలయాల సిబ్బందికి లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రస్తుతం మార్పులు చేర్పులకే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 59,959 కాగా, సభ్యుల చేరికల కోసం 4 లక్షలకు పైగా వచ్చాయి. ఈ సాంకేతిక సమస్యలను ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకునైనా పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోతామని వారంతా ఆందోళ చెందుతున్నారు.


కార్డుదారులకు అసౌకర్యం ఉండొద్దు: నాదెండ్ల

వచ్చే నెల రేషన్‌ సరుకులను జూన్‌ 1 నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా సక్రమంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సున్నితమైనదైనందున కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. బుధవారం అన్ని జిల్లాల జేసీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొత్త రేషన్‌ కార్డులు, ఇతర సేవల కోసం దరఖాస్తులు దాఖలు చేసే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అవసరమైతే దరఖాస్తు గడువు పొడిగించే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మ్యారేజీ సర్టిఫికెట్‌ అవసరం లేకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తామని, ఒకటి, రెండు రోజుల్లో అన్నీ పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.


వివాహ ధ్రువీకరణ పత్రం చిక్కులు

కొత్త రైసు కార్డు కావాల్సిన నవ దంపతులు తమ దరఖాస్తుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ జత చేయాలని ప్రభుత్వం తొలుత నిబంధన విధించింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు రావడంతో వ్యక్తంకావడంతో మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. అయినా కూడా గ్రామ, వార్డు సచివాలయాల సాఫ్ట్‌వేర్‌లో ఆ మేరకు మార్పులు చేయకపోవడంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదు.

తల్లిదండ్రులతో కలసి ఉంటున్న ఇద్దరు కుమారులు వివాహాలు చేసుకుని వేరు కాపురాలు పెట్టినప్పటికీ.. వారిలో ఒక్కరికే కొత్త కార్డు మంజూరుకు అవకాశం ఇవ్వడంతో మరొక కుమారుడు కొత్త కార్డు పొందే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

ఇతర సేవల కోసం వస్తున్న దరఖాస్తుదారుల బయోమెట్రిక్‌ పడకపోయినా దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదు. ఒకవేళ అన్నీ సక్రమంగా సరిచేసుకుని దరఖాస్తులను అప్‌లోడ్‌ చేద్దామన్నా చాలాచోట్ల సర్వర్లు మొరాయిస్తుండటంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదు.

దరఖాస్తు స్వీకరణ సమయంలో ఆధార్‌ కార్డులో ఉన్న చిరునామానే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వివాహమైన తర్వాత ఆధార్‌లో భార్య ఇంటి పేరు మారకున్నా, భార్యాభర్తల ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతూ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.


సమస్య: భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే వారి రైస్‌ కార్డు సెపరేట్‌ అవుతుందా?

పరిష్కారం: విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఉంటే స్ల్పిట్టింగ్‌ రేషన్‌ కార్డు సర్వీసులో ‘సింగిల్‌ మెంబర్‌ విత్‌ డివోర్స్‌ స్ప్లిట్‌’ అనే ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకుని రైస్‌కార్డును సెపరేట్‌ చేయవచ్చు.

సమస్య: ఒక రైస్‌కార్డులో పెళ్లి అయిన రెండు కుటుంబాలు ఉండి వారు ఒకే హౌస్‌హోల్డ్‌లో ఉంటే వారి కార్డును విభజన చేయవచ్చా?

పరిష్కారం: పెళ్లి అయ్యి రెండు కుటుంబాలు ఉంటే స్ప్లిట్టింగ్‌ రేషన్‌ కార్డు సర్వీసులో చేసుకోవచ్చు. ప్రస్తుతానికి హౌస్‌హోల్డ్‌ నుంచి స్ప్లిట్టింగ్‌ ఆప్షన్‌ లేదు.

సమస్య: ఒకే రైస్‌కార్డులో తల్లి/ తండ్రి, కొడుకు, కోడలు, మనవలు ఉండి.. తల్లి/తండ్రి చనిపోతే ఆ కార్డులో నుంచి కొడుకు కుటుంబాన్ని స్ల్పిట్‌ చేసి తల్లి/తండ్రిని సింగిల్‌గా చేయవచ్చా? అలా చేయడానికి సెపరేట్‌గా హౌస్‌హోల్డ్‌ ఉండాలా?

పరిష్కారం: ఇలాంటి వాటికి ముందు హౌస్‌హోల్డ్‌ సర్వేలో స్ల్పిట్టింగ్‌ చేసిన తర్వాత రేషన్‌ కార్డు స్ల్పిట్టింగ్‌ చేయవచ్చు.

సమస్య: రైస్‌కార్డులో భార్యను చేర్చడానికి కచ్చితంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉండాలా? ఆమె ఆధార్‌ కార్డులో భర్త పేరు ఉంటే సరిపోతుందా? లేక భర్త ఆధార్‌ ఆధారంగా రైస్‌కార్డులో చేర్చవచ్చా?

పరిష్కారం: మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. పెళ్లి కార్డు ఉంటే దానిని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సమస్య: రైస్‌ కార్డులో భార్య/పిల్లలను చేర్చడానికి భర్త/తండ్రి హౌస్‌హోల్డ్‌లో నమోదై ఉండాలా?

పరిష్కారం: కార్డులో చేర్పులు చేయడానికి హౌస్‌హోల్డ్‌ సర్వేతో సంబంధం లేదు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 04:53 AM