ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medicine Issues: బోధనాసుపత్రులకు జన ఔషధి శాపం

ABN, Publish Date - Jul 15 , 2025 | 04:52 AM

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్థానికంగా ఔషధాలు కొనుగోలు చేయడం(లోకల్‌ పర్చేజ్‌) చాలా కీలకం. ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన మందులను...

  • రోగుల ప్రాణాలతో ఆటలు

  • అర్హత లేని కంపెనీతో ఎంవోయూ

  • టెండర్లు లేకుండానే స్థానిక కొనుగోళ్లు

రోగిని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అనస్థీషియా(మత్తు) ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆ ఇంజెక్షన్‌ కనిపించలేదు. ఆపరేషన్‌ థియేటర్‌, డ్రగ్‌ స్టోర్‌, ఫార్మసీ ఇలా ఎక్కడ వెతికినా అది లభించలేదు. దీంతో రోగిని థియేటర్‌లోనే ఉంచి మందుల సరఫరాదారుకి ఫోన్‌ చేసి ఇంజెక్షన్‌ తెప్పించారు.విజయవాడ ప్రభుత్వానుపత్రుల్లో ఇటీవల జరిగిన ఈ ఘటన విస్మయం కలిగించింది. రాష్ట్రంలో చాలా భోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్థానికంగా ఔషధాలు కొనుగోలు చేయడం(లోకల్‌ పర్చేజ్‌) చాలా కీలకం. ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన మందులను ఏపీఎంఎస్ఐడీసీగ సరఫరా చేస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో మందుల సరఫరా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం వల్ల రోగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశాఖ లోకల్‌ పర్చేజ్‌కు అవకాశం కల్పించింది. ఆస్పత్రులకు కేటాయించే బడ్జెట్‌లో 80 శాతం మేరకు మందులను ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా సరఫరా చేస్తారు. మిగిలిన 20 శాతం నిధులతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు స్థానికంగా కొనుగోలు చేసుకుంటారు. దీనికి కూడా టెండర్లు పిలిచి, ఎల్‌-1 వచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరంలో మాత్రమే టెండర్‌ ప్రక్రియలు పూర్తయ్యాయి. మిగిలిన చోట ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచించిన పీఎంబీజేకే(ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు) నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇదే బోధనాస్పుత్రులకు శాపంగా మారింది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి టెండర్లు లేకుండా పీఎంబీజేకేల నుంచి స్థానికంగా మందులు కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో సూపరింటెండెంట్లు కూడా పీఎంబీజేకే లైసెన్సు ఉన్న ఒక కంపెనీతో ఎంవోయు కుదుర్చుకున్నారు. అయితే, సదరు కంపెనీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. ఆస్పత్రుల నుంచి ఆర్డర్లు పెట్టిన తర్వాత నెల రోజులకు కూడా మందులు సరఫరా చేయలేకపోతోంది. ఇటు ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు విఫలం కావడం... అటు ఎంవోయు కుదుర్చుకున్న కంపెనీ కూడా సరఫరా చేయడంలో చేతులెత్తేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌లోకి రోగిని తీసుకువెళ్లాక అనస్థీషియా ఇంజెక్షన్‌ కోసం వెతుక్కోవడానికి కారణం కూడా సదరు కంపెనీనేనని తెలిసింది. అనస్థీషియా ఇంజెక్షన్లు సరఫరా చేయాలని సదరు కంపెనీకి నెల రోజుల క్రితం ఆస్పత్రి అధికారులు ఆర్డరు పెట్టారు. అయినా.. ఆ కంపెనీ ఇంజెక్షన్లు సరఫరా చేయలేకపోయింది. దీంతో వైద్యుడికి తెలిసిన కంపెనీ నుంచి అనస్థీషియా ఇంజెక్షన్‌ తెప్పించుకుని, రోగికి ఆపరేషన్‌ పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా ఆస్పత్రులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ డీఎంఈ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అండదండలు ఉండడంతో సదరు కంపెనీపై ఫిర్యాదులు వస్తున్నా డీఎంఈ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.

జన ఔషధి పరిమితం!

జన ఔషధి కేంద్రాల్లో 1,965 రకాల మందులు, 295 సర్జికల్‌ ఐటమ్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్నిరాష్ట్రాల్లో హాబ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని షాపుల యజమానులు భువనేశ్వర్‌, చెన్నై లేదా బెంగళూరులో ఉన్న హాబ్‌ల నుంచి మందులు తెప్పించుకోవాలి. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమాచారం తెలుసుకోకుండా జన ఔషధి కేంద్రాల నుంచి మందులు కొనాలని సూపరింటెండెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. రాష్ట్రంలో 295 పీఎంబీజేకే షాపులున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఉన్న రిటైల్‌ షాపుల్లో ఎక్కువ టర్నోవర్‌, ఎక్కువ వ్యాపారం చేసే దుకాణాల యజమానులతో ఎంవోయులు చేసుకోవాలని సూపరింటెండెంట్లకు డీఎంఈ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే.. సూపరింటెండెంట్లు ఆయా దుకాణాల టర్నోవర్‌, వ్యాపారం వంటివి చూడకుండా ఆర్డర్‌ ఇచ్చారు.

ఒకే ఒక్క కంపెనీతో..

రాష్ట్రంలో పీఎంబీజేకే లైసెన్సులు 295 షాపులకు ఉన్నాయి. అయితే.. కేవలం తిరుపతి కేంద్రంగా నడిచే ఒక కంపెనీతోనే సూపరింటెండెంట్లు ఎంవోయు కుదుర్చుకున్నారు. నామినేషన్‌ పద్ధతిలో లోకల్‌ పర్చేజ్‌ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో పీఎంబీజేకే షాపులు ఏర్పాటు చేసి వాటికి లైసెన్సులు పొందారు. సదరు కంపెనీకి రాష్ట్రంలో పీఎంబీజేకే లైసెన్సులు వచ్చిన తర్వాత వాటి నుంచి మందులు కొనుగోలు చేయాలని, వాటితో ఎంవోయులు కుదుర్చుకోవాలని డీఎంఈ నుంచి సూపరింటెండెంట్లకు ఆర్డర్లు వెళ్లాయి. దీంతో డీఎంఈ ఇచ్చిన ఆర్డర్‌ను పట్టుకుని సదరు కంపెనీ ప్రతినిధులు సూపరింటెండెంట్లను సంప్రదించి, తమకు జిల్లాల్లో రిటైల్‌ షాపులున్నాయని, వాటికి లైసెన్సులున్నాయని చూపించి ఎంవోయులు కుదుర్చుకున్నారు. పీఎంబీజేకే మందుల పేరుతో సదరు కంపెనీకి మేలు చేయడంలో అధికారులు పూర్తిగా విజయం సాధించారు. కానీ, సదరు కంపెనీ ఆస్పత్రులకు అవసరమైన మందులు సరఫరా చేయడంలో విఫలమైంది. కాగా, డీఎంఈ అధికారులు పీఎంబీజేకే షాపులతో ఎంవోయూలు చేసుకోమని సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆర్డర్లు ఇచ్చారు. కానీ, ఒప్పందాలు ఎలా చేసుకోవాలనే దానిపై మార్గదర్శకాలు రూపొందించలేదు.

Updated Date - Jul 15 , 2025 | 04:53 AM