Teachers: ఏజెన్సీలో టీచర్లకు అదనపు పాయింట్లు ఇవ్వాలి
ABN, Publish Date - May 23 , 2025 | 05:42 AM
ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లకు ఏడాదికి ఒకసారి అదనపు పాయింట్లు ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చినా ఆన్‌లైన్‌లో కనబడడం లేదు. 2017లో బదిలీ అయిన టీచర్లకు ఎనిమిది సంవత్సరాల పాయింట్లు ఇస్తున్నప్పటికీ, పాయింట్లు ఇవ్వడంలో అంతరాయం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లకు ఏడాదికి ఒకటి చొప్పున అదనపు పాయింట్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని, కానీ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, వెంటనే అదనపు పాయింట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నోబుల్ టీచర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.హైమారావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే 2017లో బదిలీ అయిన టీచర్లకు ఏడేళ్ల తొమ్మిది నెలలు దాటినా ఎనిమిదేళ్లుగా పరిగణించి తప్పనిసరి బదిలీ చేస్తున్నారని, కానీ పాయింట్లు మాత్రం ఎనిమిదేళ్లకు ఇవ్వడం లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:42 AM